ట్విటర్‌కి పోటీగా.. ఇన్‌స్టా

తరగతి గది చూడని వాళ్లు ఉంటారేమోగానీ.. సామాజిక మాధ్యమాల్లో తచ్చాడని కుర్రాళ్లు అరుదు. అంతగా అలవాటైపోయారు మన యువత. ఇండియాలో మొత్తం 45 కోట్ల సామాజిక మాధ్యమ ఖాతాలున్నాయి.

Published : 24 Jun 2023 00:19 IST

తరగతి గది చూడని వాళ్లు ఉంటారేమోగానీ.. సామాజిక మాధ్యమాల్లో తచ్చాడని కుర్రాళ్లు అరుదు. అంతగా అలవాటైపోయారు మన యువత. ఇండియాలో మొత్తం 45 కోట్ల సామాజిక మాధ్యమ ఖాతాలున్నాయి. ఫొటో షేరింగ్‌ యాప్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఈ వరుసలో ముందే ఉంది. అయినా ట్విటర్‌కి పోటీగా ఓ మైక్రోబ్లాగింగ్‌ తీసుకొస్తోంది.

దీనికి పీ92 లేదా బార్సిలోనా అనే పేర్లలో ఏదో ఒకటి ఖరారు చేయనున్నట్టు సమాచారం.

దీంతో ఫొటోలు, వీడియోలు, లింక్‌లు పంచుకోవచ్చు. ఫోన్‌కాల్‌ కూడా చేసుకోవచ్చు.

ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌.. రెండింటిలోని మేటి ఫీచర్లు ఇందులో ఉంటాయి.

ఖాతాదారులు ఎవరినైనా ఫాలో కావచ్చు. నచ్చనివాళ్లను బ్లాక్‌ చేయొచ్చు, అన్‌ఫాలో కావొచ్చు.

ఇది ముఖ్యంగా టెక్స్ట్‌ బేస్డ్‌గానే పని చేస్తుంది. ఈ నెలాఖరుకల్లా అందుబాటులోకి రానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని