సాహసికుల కోసం

దూర ప్రయాణాలు, ఆకర్షణీయమైన డిజైన్‌ని ఇష్టపడే కుర్రకారు మెచ్చే ద్విచక్రవాహనాల జాబితాలో ముందుండే పేరు కేటీఎం.

Updated : 08 Jul 2023 04:33 IST

దూర ప్రయాణాలు, ఆకర్షణీయమైన డిజైన్‌ని ఇష్టపడే కుర్రకారు మెచ్చే ద్విచక్రవాహనాల జాబితాలో ముందుండే పేరు కేటీఎం. సాహస యాత్రలకు ఛలో అనే వారి కోసం ‘250 అడ్వెంచర్‌ వీ’ మోడల్‌ని విపణిలోకి దింపింది. దీన్ని గతంలో ఉన్న మోడల్‌కి మరిన్ని మెరుగులద్ది అప్‌డేటెడ్‌ వెర్షన్‌గా తీసుకొచ్చారు.

* స్టాండర్డ్‌ కేటీఎం 250 సీటు ఎత్తు 855 ఎం.ఎం. ఉంటే.. దీన్ని 834 ఎం.ఎం.కి తగ్గించారు. గ్రౌండ్‌ క్లియరెన్స్‌ని సైతం 25ఎం.ఎం. తగ్గింది.
* ఇది రేసింగ్‌ బ్లూ, ఎలక్ట్రిక్‌ ఆరెంజ్‌ అనే రెండు రంగుల్లో లభిస్తోంది. ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌, ఎల్‌సీడీ ఇన్‌స్ట్రుమెంట్‌ కన్‌సోల్‌, 14.5లీటర్ల ఇంధన ట్యాంకు, రెండు చక్రాలకు యాంటీ లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ ఉంది.
* దీని మైలేజీ 32.5కి.మీ./లీటరు. అత్యధిక వేగం 155కి.మీ./గంట.
* 249సీసీ సింగిల్‌ సిలిండర్‌ లిక్విడ్‌ కూల్‌ ఇంజిన్‌తో దూసుకెళ్తుంది. 30పీఎస్‌, 24ఎన్‌ఎం శక్తి దీని సొంతం.

ధర రూ.2.47లక్షలు (ఎక్స్‌ షోరూం)యువాహనం
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని