జీవితంలో నటించొద్దు..

టీనేజీలోనే తెరంగేట్రం.. పాతికేళ్లకే బాలీవుడ్‌ స్టార్‌ హోదా.. ఆపై హాలీవుడ్‌లో అడుగు.. ముప్ఫైలోపే మాతృత్వపు మధురిమలు. ఇదీ బాలీవుడ్‌ భామ అలియా భట్‌ హవా.

Published : 19 Aug 2023 00:54 IST

టీనేజీలోనే తెరంగేట్రం.. పాతికేళ్లకే బాలీవుడ్‌ స్టార్‌ హోదా.. ఆపై హాలీవుడ్‌లో అడుగు.. ముప్ఫైలోపే మాతృత్వపు మధురిమలు. ఇదీ బాలీవుడ్‌ భామ అలియా భట్‌ హవా. మూడు పదులకే ఎంతో పరిణతితో జీవిత పాఠాల్లాంటి మాటలు చెబుతోందిలా..

నం ఏ పని చేసినా.. అందులో నిబద్ధత, అంకితభావం ఉండాలి. రోడ్డు ఊడ్చినా, బాధ్యతాయుతమైన గొప్ప పదవిలో ఉన్నా. వందశాతం మనసు పెట్టి చేయాలంటాను. అప్పుడే ఆ పని థ్రిల్లింగ్‌గా ఉంటుంది. లేదంటే రోజూ నరకమే.

  • నన్ను నేను అద్దంలో చూసుకున్నప్పుడు నేనో స్టార్‌లా ఫీలవను. అలియా భట్‌ని మాత్రమే. అందంగా ఉన్నానా.. ఆత్మవిశ్వాసంతో ఉన్నానా.. లోపాలేంటీ.. అన్నీ కనిపిస్తుంటాయి. వాటిని సరిచేసుకోవడానికి ప్రయత్నిస్తుంటా. కెమెరా ముందుకు వెళ్లినప్పుడే నటించడం మొదలు పెడతా. ఎవరైనా సరే.. జీవితంలో నటించే పరిస్థితి వస్తే మన పతనం మొదలైందన్నట్టే.
  •  తొంభైశాతం శ్రమకి, పదిశాతం అదృష్టం తోడైతే విజయాలు సొంతమవుతాయని నేను నమ్ముతాను. మనం ఎంత సాధించినా.. వ్యక్తిత్వం సరిగా లేకపోతే ఆ విజయాలు నిలబడవు. మనం ఏ స్థాయికి చేరినా.. మనకన్నా ఓ మెట్టు పైన చాలామంది ఉంటారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉన్నప్పుడే అందరికీ గొప్పగా కనబడతాం.
  • నేను ఏదీ దాచడానికి ప్రయత్నించను. నాకు లౌక్యం, రాజకీయాలు తెలియవు. తెలిసిందల్లా నిజాయతీగా ఉండటమే. అదే నన్ను గెలిపిస్తోంది. ఎవరి వాదన వారిది. కొందరి అభిప్రాయాలు గొప్పగా ఉంటాయి. ఇంకొన్ని ఆలోచనలు రేకెత్తిస్తాయి. మరిన్ని చెత్తగా ఉంటాయి. అయినా మనకనవసరం. మన అభిప్రాయాల్ని ఇతరులపై రుద్దాలని ప్రయత్నించొద్దు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని