వరూధినీ ప్రవరాఖ్యులు.. ఓ శునకం

మా క్లాస్‌మేట్‌ ఆర్కే చదువులో పూర్‌. పరీక్షల్లో ఒక్క ప్రశ్నకూ సరైన సమాధానం రాయలేకపోయేవాడు. వాడి దగ్గర ఉన్న ప్రత్యేకమైన ప్రతిభ ఏంటంటే.. ఒక్క ప్రశ్ననూ వదలకుండా వాడికి తోచింది రాసి, జవాబు పత్రాలు మొత్తం నింపేవాడు.

Published : 16 Sep 2023 00:50 IST

క్లాస్‌రూం కహానీలు

మా క్లాస్‌మేట్‌ ఆర్కే చదువులో పూర్‌. పరీక్షల్లో ఒక్క ప్రశ్నకూ సరైన సమాధానం రాయలేకపోయేవాడు. వాడి దగ్గర ఉన్న ప్రత్యేకమైన ప్రతిభ ఏంటంటే.. ఒక్క ప్రశ్ననూ వదలకుండా వాడికి తోచింది రాసి, జవాబు పత్రాలు మొత్తం నింపేవాడు. ప్రశ్నకు కొంచెం కూడా సంబంధం లేకుండా వాడికి ఆ సమయానికి ఏది తోస్తే అది రాసేవాడు. ఆ పరీక్షలో ‘ప్రవరుని స్వగతం’ పాఠం నుంచి వచ్చిన ప్రశ్నకు మనోడు జాగ్రఫీలోని అమెజాన్‌ అడవులలో సంచరించే అమెజాన్‌ కుక్క గురించి రాశాడు. మా తెలుగు ఉపాధ్యాయుడు సమాధాన పత్రాలు ఇచ్చేటప్పుడు ఆర్కేని ప్రత్యేకంగా పిలిచి ‘నాయనా ఆర్కే.. వరూధినీ ప్రవరాఖ్యుల మధ్య అమెజాన్‌ కుక్క ఎందుకు వచ్చింది? రాయబారం నడపడానికా? కొంచెం వివరణ ఇవ్వరా..’ అని అడగ్గానే క్లాసంతా గొల్లున నవ్వింది.

మనోజ్‌ ధోత్రే, గద్వాల్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని