ఇంటిపేరు ఎక్స్‌వైజడ్‌

డిగ్రీ ఫస్టియర్‌ తరగతి. ‘వచ్చే నెలలో ఫ్రెషర్స్‌ డే వేడుకలు నిర్వహిస్తాం. ఆసక్తి ఉన్నవాళ్లు చేతులు పైకెత్తండి’ అన్నారు మా లెక్చరర్‌. క్లాసులో దాదాపు సగానికిపైగా చేతులెత్తారు.

Published : 23 Dec 2023 00:33 IST

డిగ్రీ ఫస్టియర్‌ తరగతి. ‘వచ్చే నెలలో ఫ్రెషర్స్‌ డే వేడుకలు నిర్వహిస్తాం. ఆసక్తి ఉన్నవాళ్లు చేతులు పైకెత్తండి’ అన్నారు మా లెక్చరర్‌. క్లాసులో దాదాపు సగానికిపైగా చేతులెత్తారు. కాలేజీ మొదలై, అప్పటికి ఎక్కువరోజులు కాకపోవడంతో.. మా అందరి పేర్లూ ఆమెకు గుర్తు లేవు. వరుసగా ఒక్కొక్కరి పేర్లు చెప్పమన్నారు. ముందు బెంచీలో సాయి లేచి, వాడి ఇంటిపేరుతో సహా చెప్పాడు. ‘మీ సర్‌నేమ్‌ అక్కర్లేదు’ అన్నారామె. తర్వాత శ్రీకర్‌కి ఏమి అర్థం అయ్యిందోగానీ.. ‘నా పేరు ఎక్స్‌వైజడ్‌ శ్రీకర్‌’ అన్నాడు. తర్వాత శ్రీకాంత్‌.. ‘ఏబీసీ శ్రీకాంత్‌’ అన్నాడు. ఇంటిపేరు అసలే వద్దంటే, వాళ్లు మార్చి చెప్పాలి అనుకున్నారు కాబోలు. దాంతో క్లాసులో నవ్వులు మార్మోగాయి. అప్పట్నుంచి మా డిగ్రీ పూర్తయ్యేవరకూ ఆ ఇద్దరినీ ‘ఎక్స్‌వైజడ్‌’, ‘ఏబీసీ’ అని పిలుస్తూనే ఆట పట్టించేవారు మా లెక్చరర్‌.                

అన్వేశ్‌.ఎస్‌, ఈమెయిల్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని