Updated : 29 Jan 2022 06:08 IST

పంచుకుందాం

నీ తలపులతోనే...
నా రోజు మొదలవుతుంది...
ముగుస్తుంది కూడా!

చేరువై పక్కనే ఉంటావనుకున్నా...
దూరమై గుండెల్లో నిలిచిపోయావు!

నేనెప్పుడూ ఒంటరి కాదు...
గతంలో నువ్వు.. ఇప్పుడు నీ జ్ఞాపకాలు..
వెంటే ఉన్నాయిగా!

ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే...
నేనెక్కడా లేను
నా గతమంతా నువ్వే!

ప్రేమ... ఎంత చిత్రమో...?
అద్దంలో చూసినా..
నువ్వే కనిపిస్తున్నావు!

- అభిజిత్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని