అబ్బాయికి.. NO చెప్పే దమ్ముందా?

మంచి కుర్రాడని మాట కలిపింది భావన. మొహమాటంకొద్దీ నాలుగుసార్లు పార్టీలకు వెళ్లింది. అది ప్రేమంటాడు. నువ్వూ ప్రేమించి తీరాలంటాడు పవన్‌. అమ్మాయి లేదా అబ్బాయి ఇద్దరికీ ఇలాంటి పరిస్థితి ఎదురయ్యే ఉంటుంది. స్నేహం చెడకుండా మరి వాళ్లకి సున్నితంగా ‘నో’ చెప్పేదెలా?

Published : 02 Apr 2022 02:16 IST

మంచి కుర్రాడని మాట కలిపింది భావన. మొహమాటంకొద్దీ నాలుగుసార్లు పార్టీలకు వెళ్లింది. అది ప్రేమంటాడు. నువ్వూ ప్రేమించి తీరాలంటాడు పవన్‌. అమ్మాయి లేదా అబ్బాయి ఇద్దరికీ ఇలాంటి పరిస్థితి ఎదురయ్యే ఉంటుంది. స్నేహం చెడకుండా మరి వాళ్లకి సున్నితంగా ‘నో’ చెప్పేదెలా?

* నువ్వో అద్భుతమైన వ్యక్తివి. నీలాంటి వ్యక్తి దొరకడం ఎవరికైనా అదృష్టం. కానీ నీపై నాకెలాంటి ఫీలింగ్‌ లేదు. దయచేసి నన్ను క్షమించు.

* కలిసి పార్టీలు చేసుకున్నా.. షికార్లకు వెళ్లినా.. సరదాగా మాట్లాడుకుంటున్నా.. ఇది స్నేహంలో భాగమే సుమా! నువ్వు వేరే ఏదేదో ఊహించుకోవద్దు.

* ప్రేమ, రొమాన్స్‌ నాకు కాబోయే జీవిత భాగస్వామితోనే. నువ్వు ఆశలేం పెట్టుకోవద్దు. ఆ ఉద్దేశమే వద్దు.

* ప్రేమ పెళ్లి తప్పేమీ కాదు. కానీ ఎవరి ఇష్టాలు వాళ్లవి. ఎవరి అభిప్రాయాలు వాళ్లవి. నేను మాత్రం అమ్మానాన్నలు చూసిన సంబంధమే చేసుకుంటా.

* చొరవగా ఉండటం నా నైజం. దీన్ని ప్రేమగా భావించొద్దు. నీపై ఇష్టం కలిగితే తప్పకుండా చెబుతా. అప్పటిదాకా నువ్వెలాంటి ఫీలింగ్స్‌ పెట్టుకోవద్దు.

* మనవి భిన్న మనస్తత్వాలు, అభిప్రాయాలు. ఇవి ఎప్పటికీ కలిసేలా లేవు. నాపై ఇష్టం, ప్రేమ ఉంటే దయచేసి ఇంతటితో ముగిస్తే మంచిది.

* ప్రతి పరిచయం, స్నేహం.. ప్రేమగా మారాలనేమీ లేదు. మనం మంచి స్నేహితులుగా ఉండిపోదాం. అంతకుమించి ముందుకెళ్లడం నాకిష్టం లేదు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని