రీసైకిల్‌ సరిగమలు..

చల్లని సాయంత్రం.. ఆరుబయట కూర్చొని వేడివేడిగా సెగలు కక్కే కాఫీనో, టీనో తాగుతూ... హుషారైన పాటలు వింటుంటే ఆ హాయే వేరు.

Published : 14 Jan 2023 00:27 IST

చల్లని సాయంత్రం.. ఆరుబయట కూర్చొని వేడివేడిగా సెగలు కక్కే కాఫీనో, టీనో తాగుతూ... హుషారైన పాటలు వింటుంటే ఆ హాయే వేరు. ఇలాంటి అలవాటు ఉండే కుర్రాళ్లకు కొరతే లేదు. ఈ అభిరుచికి తగ్గట్టుగా వైర్‌లెస్‌ స్పీకర్లు చాలానే అందుబాటులో ఉన్నాయి. జేబీఎల్‌ కంపెనీ ఇందులోనూ బ్ని  Go 3 Eco and Clip 4 Eco పేరుతో ప్రత్యేకమైనవి విపణిలోకి తీసుకొచ్చింది. పోస్ట్‌ కన్జూమర్‌ రీసైకిల్డ్‌ (పీసీఆర్‌) ప్లాస్టిక్‌తో వీటిని రూపొందిస్తారు. జేబులో పెట్టుకునేంత పరిమాణంలో ఉంటాయి. ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే పదిగంటలు పని చేస్తాయి.      

ధర రూ.3 వేలు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని