బండి మండిపోకుండా..

గమ్యం చేర్చే బైక్‌, కారులాంటివి.. కేవలం వాహనాలే కాదు.. యువతకి ప్రియనేస్తాలు కూడా. మరి ఎండలు మండిపోతున్న ఈ సమయంలో మన ఫ్రెండ్స్‌ హీటెక్కిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలిగా!

Published : 15 Apr 2023 00:02 IST

యువాహనం

మ్యం చేర్చే బైక్‌, కారులాంటివి.. కేవలం వాహనాలే కాదు.. యువతకి ప్రియనేస్తాలు కూడా. మరి ఎండలు మండిపోతున్న ఈ సమయంలో మన ఫ్రెండ్స్‌ హీటెక్కిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలిగా!

 వేసవిలో బండి కూల్‌కూల్‌గా ఉండాలంటే ఎండలో నిలపకుండా ఉంటే సగం పని పూర్తైనట్టే. కారు అయితే క్యాబిన్‌ నుంచి వేడి వెళ్లిపోవడానికి అద్దాలను కాస్త కిందికి దించి ఉంచాలి.

 ఈ సమయంలో కారులో ఏసీ వాడకం ఎక్కువ. దాంట్లో ఏదైనా సమస్య తలెత్తితే పెద్ద ఇబ్బందే. ఎందుకైనా మంచిది ముందే ఏసీని ఒకసారి సర్వీసింగ్‌ చేయిస్తే అనవసర ఇబ్బందులు, సమస్యల నుంచి తప్పించుకోవచ్చు.

మోటార్‌సైకిల్‌, కారు టైర్లలో గాలి ఎక్కువైనా, తక్కువైనా ఇబ్బందే. ఒక్కోసారి ప్రమాదకరం కూడా. ఈ సీజన్‌లో టైర్‌ ప్రెషర్‌ని తరచూ పరీక్షిస్తూ తగినంత ఉండేలా చూసుకోవాలి.

రేడియటర్‌, కూలంట్‌లు, ట్రాన్స్‌మిషన్‌ ఫ్లూయిడ్లు, బ్యాటరీ ఇవి బండి సాఫీగా కదలడానికి తోడ్పడతాయి. ఇవి సరిగా లేకపోతే.. వాహనం హీటెక్కిపోయి మంటలు చెలరేగే ప్రమాదం ఉంది. వీటిని ఎప్పటికప్పు డు పరీక్షిస్తుండాలి. మరమ్మతులు చేయించాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు