Cold: చలిగాలి వీస్తోంది..!

ఉత్తర భారతదేశం నుంచి చల్లటి పొడి గాలులు రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నందున వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా చలిగాలుల తీవ్రత పెరిగింది....

Updated : 19 Dec 2021 04:18 IST

చింతపల్లిలో 6.1 డిగ్రీలు
గజగజలాడుతున్న తీర ప్రాంతం, మన్యం

ఈనాడు, విశాఖపట్నం; న్యూస్‌టుడే, చింతపల్లి, పాడేరు పట్టణం:  ఉత్తర భారతదేశం నుంచి చల్లటి పొడి గాలులు రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నందున వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా చలిగాలుల తీవ్రత పెరిగింది. కొద్ది రోజులుగా రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రాష్ట్రమంతటా ఇదే పరిస్థితి నెలకొన్నా తీర ప్రాంతాల్లో మరింత ఎక్కువగా ఉంది. సాధారణ ఉష్ణోగ్రతల కన్నా 2 నుంచి 4 డిగ్రీల వరకు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోయే కొద్ది రోజుల పాటు పరిస్థితి ఇలానే ఉండనుంది. ఉత్తర దిశ నుంచి చలిగాలులు రావడంతో చలి పెరగడం, వాతావరణం పొడిబారుతోందని అమరావతి వాతావరణ కేంద్ర సంచాలకులు స్టెల్లా తెలిపారు. విశాఖ జిల్లా చింతపల్లిలో రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శనివారం రికార్డు స్థాయిలో 6.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్లో ఇదే అత్యల్పం. మిగిలిన ప్రాంతాల కన్నా చింతపల్లి ఎత్తులో ఉండడం, పచ్చదనంతో కూడిన కొండ ప్రాంతం కావడంతో ఇక్కడ వాతావరణం చల్లబడుతుంది. ఇక్కడి నీటి ఆవిరికి ఉత్తర దిశ నుంచి వచ్చే చలిగాలులు తోడవడంతో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానం వాతావరణ విభాగ పరిశోధన సహాయకురాలు డా.సౌజన్య తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని