Andhra News: ప్రభుత్వ బడిలో ఐఏఎస్‌ పిల్లలు

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ తమ పిల్లలను సాధ్యమెనంతవరకు కార్పొరేట్‌ పాఠశాలలకు పంపేందుకు మొగ్గు చూపుతున్నారు. ఆర్థిక స్తోమత లేకపోయినా అప్పులు

Updated : 06 Jul 2022 08:01 IST

పటమట, విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ తమ పిల్లలను సాధ్యమెనంతవరకు కార్పొరేట్‌ పాఠశాలలకు పంపేందుకు మొగ్గు చూపుతున్నారు. ఆర్థిక స్తోమత లేకపోయినా అప్పులు చేసి ఫీజులు కడుతున్నారు. ఓ ఐఏఎస్‌ అధికారి మాత్రం తన ఇద్దరు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. శాప్‌ వీసీ, ఎండీ ఎన్‌.ప్రభాకరరెడ్డి తన ఇద్దరు పిల్లలను మంగళవారం విజయవాడలోని పటమట కోనేరు బసవయ్య చౌదరి జడ్పీ ఉన్నత పాఠశాలలో చేర్పించారు. ఆయన గతంలో నెల్లూరు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా చేస్తున్న సమయంలోనూ ప్రభుత్వ పాఠశాలల్లోనే వారిని చదివించారు. ప్రభాకరరెడ్డి భార్య లక్ష్మి, ఇద్దరు పిల్లలతో కలసి పాఠశాలకు వచ్చి ప్రవేశాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ పాఠశాలలో వసతులు, విశాలమైన ఆట స్థలం ఉండడంతో ఇక్కడ  చేర్పిస్తున్నామని తెలిపారు. బాబుకు ఆరో తరగతి, పాపకు ఎనిమిదో తరగతి అడ్మిషన్లు తీసుకున్నట్టు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని