AP Govt: ఏపీలో చర్చిలకు రూ.175 కోట్లు.. నియోజకవర్గానికి రూ.కోటి చొప్పున..

రాష్ట్రవ్యాప్తంగా చర్చిల నిర్మాణం, మరమ్మతులు, ఇతర పనులకు ప్రభుత్వం రూ.175 కోట్లు అందించనుంది.

Updated : 18 Nov 2022 09:14 IST

ఈనాడు డిజిటల్‌- అమరావతి, న్యూస్‌టుడే- ఒంగోలు గ్రామీణం: రాష్ట్రవ్యాప్తంగా చర్చిల నిర్మాణం, మరమ్మతులు, ఇతర పనులకు ప్రభుత్వం రూ.175 కోట్లు అందించనుంది. నియోజకవర్గానికి రూ.కోటి చొప్పున కేటాయించనుంది. కొత్త చర్చిల నిర్మాణం, పాతవాటి పునర్నిర్మాణం, మరమ్మతులు, చర్చి నిర్వహించే సంస్థలు, శ్మశాన వాటికల ఆధునికీకరణకు ఈ నిధులు వెచ్చించాలి. జిల్లా కేంద్రాల్లో అదనంగా మరో కోటి విలువైన పనులు చేపట్టేందుకు అనుమతి ఉన్నట్లు తెలిసింది. ఈ నిధుల్ని గ్రాంటు ఇన్‌ ఎయిడ్‌ విధానంలో అందించనుంది. ఈ మేరకు ఎమ్మెల్యేల నుంచి ప్రతిపాదనలు స్వీకరించాలని రాష్ట్ర క్రైస్తవ ఆర్థిక సంస్థ ఈ నెల 7వ తేదీన ఉత్తర్వులు జారీచేసింది. ఆ ప్రకారం కలెక్టర్లు జిల్లాల్లో ప్రతిపాదనల స్వీకరణకు ఆదేశాలు ఇస్తున్నారు. ఈ నెల 19లోగా ప్రతిపాదనలు అందించాలని ప్రకాశం జిల్లా కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. వైకాపా ప్రభుత్వం అధికారం చేపట్టాక చర్చిల నిర్మాణం, మరమ్మతులు, ఇతర పనులకు భారీగానే దరఖాస్తు చేసుకున్నారు. దాదాపు 200 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని