ఆల్ట్రోజ్‌ ఐటర్బో పెట్రోల్‌ ఫీచర్లు ఇవీ..

టాటా ఆల్ట్రోజ్‌ ఐటర్బో పెట్రోల్‌ కారు విడుదలకు సిద్ధమైంది. దీని ఫీచర్లను విడుదల సందర్భంగా అందుబాటులోకి తెచ్చారు. ఆల్ట్రోజ్‌తో పోలిస్తే దీని ఫీచర్లలో పెద్దగా మార్పులు లేవు

Published : 13 Jan 2021 22:54 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టాటా ఆల్ట్రోజ్‌ ఐటర్బో పెట్రోల్‌ కారు విడుదలకు సిద్ధమైంది. దీని ఫీచర్లను విడుదల సందర్భంగా అందుబాటులోకి తెచ్చారు. ఆల్ట్రోజ్‌తో పోలిస్తే దీని ఫీచర్లలో పెద్దగా మార్పులు లేవు. 1.2లీటర్‌ ఇంజిన్‌ను దీనికి అమర్చారు. ఇది మూడుసిలెండర్లతో టర్బోఛార్జి ఆధారంగా నడుస్తుంది. దీనిని నెక్సన్‌ సరికొత్త వెర్షన్‌లో కూడా ఉపయోగించారు. ఇది 108 బీహెచ్‌పీ శక్తిని 140 ఎన్‌ఎం పీక్‌టార్క్‌ను విడుదల చేస్తుంది.  ఈ కొత్త ఇంజిన్‌ గతంలో ఇంజిన్‌తో పోలిస్తే 28శాతం అదనపు శక్తిని.. 24శాతం అదనపు టార్క్‌ను విడుదల చేస్తుంది.  5స్పీడ్‌ మాన్యూవల్‌ గేర్‌బాక్స్‌ను దీనికి ఇచ్చారు.  ఈ కారు 0-100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 11.9 క్షణాల్లో అందుకొంటుంది. ఇక ఐటర్బో ఇంజిన్‌ లీటర్‌ పెట్రోల్‌కు 18.13 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. 

సరికొత్త ఐటర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ కారు ఎక్స్‌టీ, ఎక్స్‌జెడ్‌,ఎక్స్‌జెడ్‌ప్లస్‌ అనే మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. కారు హార్బర్‌ బ్లూ, హైస్ట్రీట్‌ గోల్డ్‌, మిడ్‌టౌన్‌ గ్రే,డౌన్‌టౌన్‌ రెడ్‌, అవెన్యూవైట్‌ రంగుల్లో లభిస్తుంది. కారులో లెదర్‌సీట్లు, మల్టీడ్రైవ్‌ మోడ్‌లు, డ్రైవర్‌ సీటు ఎత్తులో మార్పులు చేసుకొనే అవకాశం, రియర్‌ ఆర్మ్‌రెస్ట్‌ , పవర్ అవుట్‌లెట్‌, వన్‌టచ్‌ పవర్‌ విండోస్‌, క్రూజ్‌ కంట్రోల్‌, ఇంజిన్‌స్టార్ట్‌ అండ్‌ స్టాప్‌ బటన్‌,ఎక్సప్రెస్‌ కూల్‌ ఫంక్షన్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇక టాటా ఐఆర్‌ఏ టెక్‌, కార్‌కనెక్టడ్‌ ఫీచర్లు ఉన్నాయి. గ్లోబల్‌ ఎన్‌సీఏపీలో దీనికి 5స్టార్‌ రేటింగ్‌ లభించింది. దీని బుకింగ్స్‌ స్వీకరణ కూడా టాటా మొదలుపెట్టింది. 

ఇదీ చదవండి

బీఎండబ్ల్యూ పెట్రోల్‌ రకం 2 సిరీస్‌ గ్రాన్‌ కూపే రూ.40.9 లక్షలు
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని