ఆరోగ్య సంరక్షణ సేవల్లోకిఅమెజాన్‌

అమెరికాలో ఆరోగ్య సంరక్షణ సేవల్లోకి అమెజాన్‌ అడుగుపెట్టింది. తొలుత టెలిమెడిసన్‌  సేవలు అందించనుంది....

Published : 18 Mar 2021 01:00 IST

ఫాల్స్‌ చర్చ్‌: అమెరికాలో ఆరోగ్య సంరక్షణ సేవల్లోకి అమెజాన్‌ అడుగుపెట్టింది. తొలుత టెలిమెడిసన్‌  సేవలు అందించనుంది. ప్రస్తుతం వాషింగ్టన్‌ రాష్ట్రంలోని కంపెనీ ఉద్యోగులకు మాత్రమే ఈ సేవలు లభించనున్నాయి. అమెజాన్‌ కేర్‌ యాప్‌పై డాక్టర్లు, నర్సు ప్రాక్టీషనర్లు, నర్సుల ద్వారా 24 గంటలూ ఫోన్‌లో వినియోగదారులు సేవలు పొందొచ్చు. సియాటిల్‌ ప్రాంతంలో మందుల డెలివరీ, ఫోన్‌ చేస్తే ఇంటికే నర్సింగ్‌ సేవల వంటివి అందించనున్నారు. తదుపరి దేశవ్యాప్తంగా అమెజాన్‌ ఉద్యోగులు, ప్రైవేట్‌ కంపెనీలకు ఈ సేవలను విస్తరిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని