Axis Bank: ఎంపిక చేసిన గృహరుణాలపై 12 ఈఎంఐల రద్దు

ఎంపిక చేసిన గృహరుణ పథకాలపై 12 నెలవారీ వాయిదాలను (ఈఎంఐ) రద్దు చేస్తున్నట్లు యాక్సిస్‌ బ్యాంక్‌ తెలిపింది. పండగల వేళ.. పలు కొనుగోళ్లపై రాయితీలనూ అందిస్తున్నట్లు పేర్కొంది. ద్విచక్ర వాహనాల కొనుగోలుకు

Updated : 20 Oct 2021 09:17 IST

యాక్సిస్‌ బ్యాంక్‌

దిల్లీ: ఎంపిక చేసిన గృహరుణ పథకాలపై 12 నెలవారీ వాయిదాలను (ఈఎంఐ) రద్దు చేస్తున్నట్లు యాక్సిస్‌ బ్యాంక్‌ తెలిపింది. పండగల వేళ.. పలు కొనుగోళ్లపై రాయితీలనూ అందిస్తున్నట్లు పేర్కొంది. ద్విచక్ర వాహనాల కొనుగోలుకు ఆన్‌రోడ్‌ ధర మేరకు రుణాలను ఎలాంటి పరిశీలనా రుసుము లేకుండా ఇస్తున్నట్లు వెల్లడించింది. వ్యాపార సంస్థలకు టర్మ్‌ రుణాలతో పాటు, వాణిజ్య వాహనాల కోసం ప్రత్యేక రుణాలను ఇస్తున్నట్లు పేర్కొంది. దీపావళి ప్రత్యేక ఆఫర్ల పేరిట ఇస్తున్న రాయితీలు యాక్సిస్‌ డెబిట్‌, క్రెడిట్‌ కార్డులతో చేసే కొనుగోళ్లకు వర్తిస్తుంది. 50 నగరాల్లో ఎంపిక చేసిన 2,500 దుకాణాల నుంచి కొనుగోలు చేసినప్పుడు 20 శాతం వరకు రాయితీ లభిస్తుందని బ్యాంకు రిటైల్‌ రుణాల విభాగాధిపతి సుమిత్‌ బాలి తెలిపారు. ప్రముఖ బ్రాండ్లతో పాటు, స్థానిక దుకాణదారుల దగ్గరా ఈ ఆఫర్లు ఉంటాయని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని