బీఎండబ్ల్యూ 6 సిరీస్‌ సెడాన్‌

బీఎండబ్ల్యూ ఆధునికీకరించిన 6 సిరీస్‌ సెడాన్‌ను భారత విపణిలోకి విడుదల చేసింది. దీని ధర రూ.67.9 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌). పెట్రోల్‌ రకం 630ఐ ఎం స్పోర్ట్‌ ధర రూ.67.9 లక్షలు కాగా....

Published : 09 Apr 2021 16:01 IST

దిల్లీ: బీఎండబ్ల్యూ ఆధునికీకరించిన 6 సిరీస్‌ సెడాన్‌ను భారత విపణిలోకి విడుదల చేసింది. దీని ధర రూ.67.9 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌). పెట్రోల్‌ రకం 630ఐ ఎం స్పోర్ట్‌ ధర రూ.67.9 లక్షలు కాగా.. డీజిల్‌ రకం 630డి ఎం స్పోర్ట్‌ ధర రూ.68.9 లక్షలు, బీఎం 620డి లగ్జరీ లైన్‌ ధర రూ.77.9 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. 2-లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌తో 630ఐ రూపొందింది. ఇది 258 హెచ్‌పీ సామర్థ్యంతో 6.5 సెకన్లలోనే 100 కి.మీటర్ల గరిష్ఠ వేగాన్ని అందుకుంటుంది. 2-లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌తో రూపొందిన 620డి 190 హెచ్‌పీ సామర్థ్యంతో 7.9 సెకన్లలో 100 కి.మీ.ల గరిష్ఠ వేగాన్ని అందుకుంటుంది. 3-లీటర్‌ 6-సిలిండర్‌ డీజిల్‌ ఇంజిన్‌తో రూపొందిన 630డి 265 హెచ్‌పీ సామర్థ్యంతో 6.1 సెకన్లలో 100 కి.మీ.ల గరిష్ఠ వేగాన్ని అందుకుంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని