ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు

ముందుగా నిర్ణ‌యించిన కాలానికి బ్యాంకు లేదా ఆర్థిక సంస్థలో  కొంత సొమ్మును  దాచుకుని, దానిపై వడ్డీ పొందటాన్ని ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌(ఎఫ్‌డీ) అంటారు. ఎఫ్‌డీలపై ముందుగానే ఒక స్థిరమైన వడ్డీని నిర్ణయిస్తారు. నిల్వ ఉంచే సొమ్ము, కాల వ్యవధిని బట్టి వివిధ బ్యాంకులు వడ్డీ రేట్లు ఉంటాయి...

Published : 18 Dec 2020 16:21 IST

ముందుగా నిర్ణ‌యించిన కాలానికి బ్యాంకు లేదా ఆర్థిక సంస్థలో  కొంత సొమ్మును  దాచుకుని, దానిపై వడ్డీ పొందటాన్ని ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌(ఎఫ్‌డీ) అంటారు. ఎఫ్‌డీలపై ముందుగానే ఒక స్థిరమైన వడ్డీని నిర్ణయిస్తారు. నిల్వ ఉంచే సొమ్ము, కాల వ్యవధిని బట్టి వివిధ బ్యాంకులు వడ్డీ రేట్లు ఉంటాయి.

అర్హత :

  • వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు, ట్రస్టులు, సంఘాలు, క్లబ్బులు, సమితులు వారి కేవైసీ వివరాలు సమర్పించి ఫిక్స్‌డ్‌ డిపాజిట్ ప్రారంభించ వచ్చు.

కాల పరిమితి :

  • ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో సొమ్మును 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకూ పొదుపు చేసుకునేందుకు వీలుంది.

డిపాజిట్ పరిమితి :

  • ఎఫ్‌డీ లో ఉంచగల కనిష్ట మొత్తం బ్యాంకును బట్టి మారుతూ ఉంటుంది.
  • కొన్ని బ్యాంకులు కనీస పరిమితిని రూ. 10,000 గా నిర్ధారించాయి.
  • ఫిక్స్‌డ్‌ డిపాజిట్లో పొదుపుకి సాధారణంగా గరిష్ఠ పరిమితి ఉండదు.

రాబడి

  • డిపాజిట్ చేసే సమయంలో నిర్ధారించిన రాబడి పూర్తి కాలావధికి వర్తిస్తుంది.
  • సాధారణంగా మూడు నెలల చక్ర వడ్డీ వర్తింపు ఉంటుంది.
  • ఒక సారి ఫిక్స్‌డ్‌ డిపాజిట్లో పొడుపు చేశాక, దేశ ఆర్థిక వ్యవస్థలో వడ్డీ రేట్ల మార్పులు జరిగినా, ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల పై ముందు నిర్ధారించిన వడ్డీనే వర్తిస్తుంది.
  • సాధారణంగా సీనియర్‌ సిటిజన్లకు .5 శాతం వరకూ అధిక వడ్డీని చెల్లిస్తారు.

డిపాజిట్ల పై వడ్డీ లెక్కింపు విధానం
ఫిక్స్‌డ్‌ డిపాజిట్ క్యాలిక్యులేటర్

రుణ సదుపాయం :

ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ఖాతాలపై బ్యాంకులు రుణ సదుపాయాన్ని, ఓవర్‌డ్రాఫ్ట్‌ రూపంలో కల్పిస్తాయి.

మధ్యలో ఉపసంహరిస్తే :

  • కాల పరిమితి కన్నా ముందుగా సొమ్మును విత్ డ్రా చేస్తే, బ్యాంకులు పెనాలిటీ విధిస్తాయి.

రాబడి పై పన్ను వర్తింపు :

  • ఫిక్స్‌డ్‌ డిపాజిట్ వడ్డీపై పన్ను, వ్యక్తికి వర్తించే పన్ను స్లాబుని అనుసరించి ఉంటుంది.
  • పదివేల లోపు ఆదాయంపై మూలం వద్ద పన్ను (TDS) వర్తించదు.
  • పదివేల పైన ఆదాయం పై 10% TDS విధిస్తారు.
  • TDS నుంచి మినహాయింపు పొందాలంటే ఫారం 15G / 15H బ్యాంకుకు సమర్పించవచ్చు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని