అదరగొట్టిన డీమార్ట్‌.. ₹447 కోట్ల లాభం

డీమార్ట్‌ పేరిట రిటైల్‌ వ్యాపారాన్ని నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ లిమిటెడ్‌ మూడో త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.446.95 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని......

Updated : 09 Jan 2021 21:18 IST

దిల్లీ: డీమార్ట్‌ పేరిట రిటైల్‌ వ్యాపారాన్ని నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ లిమిటెడ్‌ మూడో త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.446.95 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని పొందింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.384.01 కోట్లు కావడం గమనార్హం. ఈ లెక్కన నికర లాభం 16.39 శాతం మేర పెరిగినట్లు బీఎస్‌ఈ ఫైలింగ్‌లో అవెన్యూ సూపర్‌ మార్ట్స్‌ పేర్కొంది.

సమీక్షిస్తున్న త్రైమాసికంలో ఆపరేషన్స్‌ ద్వారా 10.77 శాతం వృద్ధితో రూ.7,542 కోట్ల ఆదాయం సముపార్జించినట్లు అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ తెలిపింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ.6,808.93 కోట్లు కావడం గమనార్హం. ఇదే కాలంలో రూ.6,977.88 కోట్లు ఖర్చులుగా కంపెనీ చూపించింది. స్టాండలోన్‌ పద్ధతిలో కంపెనీ నికర లాభం 19.27 శాతం వృద్ధితో రూ.470.25 కోట్లకు చేరగా.. ఆదాయం రూ.7,432.69 కోట్లు వచ్చినట్లు కంపెనీ పేర్కొంది. కొవిడ్‌-19 అనంతరం ఊహించిన దానికంటే వినియోగం పెరిగిందని, పండగ అమ్మకాలు కలిసి రావడంతో కంపెనీ వ్యాపారం వృద్ధి చెందిందని అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ సీఈవో, ఎండీ నివెల్లీ నోరోన్హా ఫలితాలనుద్దేశించి అన్నారు.

ఇవీ చదవండి..
ఫ్యూచర్‌ ట్రేడింగ్స్‌: రూ.2వేలు తగ్గిన బంగారం ధర
9 నెల‌ల్లో 52 ల‌క్షల మంది చేరారు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని