బడ్జెట్ వివరాలు: యాప్‌లో వీక్షించండి

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ మరికొద్ది సేపట్లో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

Published : 01 Feb 2021 10:48 IST

ట్వీట్ చేసిన ఓం బిర్లా

దిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ మరికొద్ది సేపట్లో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. చరిత్రలోనే మొదటిసారిగా ఈసారి బడ్జెట్ కాగితరహితంగా రానుంది. ఈ నేపథ్యంలో బడ్జెట్ వివరాలను ఆన్‌లైన్‌లో వీక్షించవచ్చని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ట్విటర్ వేదికగా వెల్లడించారు.

‘ఈ రోజు ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. చరిత్రలో తొలిసారి ఈ బడ్జెట్‌ను డిజిటల్ ఫార్మాట్‌లో సమర్పిస్తున్నాం. దానికి సంబంధించిన ప్రతులు indiabudget.gov.in పోర్టల్‌ లేక యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్‌లో అందుబాటులో ఉండనున్నాయి’ అని బిర్లా ట్వీట్ చేశారు. వాటిని డౌన్‌లోడ్ చేసుకునే వీలుకూడా ఉంది. కరోనా కారణంగా ఈ సమావేశాలు కాగితరహితంగా మారడంతో..సభ్యులకు కూడా బడ్జెట్ సాఫ్ట్ కాపీలు అందించనున్నారు. ఆర్థిక మంత్రి సంప్రదాయ బాహీఖాటాను వదిలి స్వదేశీట్యాబ్‌తో పార్లమెంట్‌కు బయల్దేరారు.

ఇవీ చదవండి:

బడ్జెట్ ‘ట్యాబ్‌’తో నిర్మలమ్మ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని