ఎన్‌పీఎస్ కంటే ఈఎల్ఎస్ఎస్‌లో రిస్క్‌, రాబ‌డి ఎక్కువా?

దీర్ఘ‌కాలీక పెట్టుబ‌డుల‌కు ఈఎల్ఎస్ఎస్‌లో పెట్టుబ‌డులు పెట్టాల‌నుకుంటే రిస్క్ ఎక్కువ‌గానే ఉంటుంది.....

Published : 18 Dec 2020 16:14 IST

దీర్ఘ‌కాలీక పెట్టుబ‌డుల‌కు ఈఎల్ఎస్ఎస్‌లో పెట్టుబ‌డులు పెట్టాల‌నుకుంటే రిస్క్ ఎక్కువ‌గానే ఉంటుంది.

జాతీయ పింఛ‌ను ప‌థ‌కం (ఎన్‌పీఎస్) ప‌ద‌వీ విర‌మ‌ణ కోసం నిధిని ఏర్పాటు చేసుకునే ఉద్దేశంతో ప్రారంభించారు. ఒక 40 ఏళ్ల వ‌య‌సు గ‌ల పెట్టుబ‌డుదారుడు 2009 నుంచి ప్ర‌తి ఏడాది జ‌న‌వ‌రి, జులై నెల‌ల్లో రూ.25 వేలు ఎన్‌పీఎస్ టైర్-1 లో పెట్టుబ‌డులు ప్రారంభించాడు. 2018 నాటికి మొత్తం పెట్టుబ‌డులు రూ.4.5 ల‌క్ష‌లు కాగా రాబ‌డితో క‌లిపి రూ.7.14 ల‌క్ష‌ల‌కు చేరింది. అంత‌ర్గ‌త రేటు (ఐఆర్ఆర్‌) 9.6 శాతంగా న‌మోదైంది. రిస్క్ కూడా త‌క్కువ‌గా ఉంది. ఒక‌సారి మార్కెట్లు ఒడుదొడుకుల‌కు లోనైపు వృద్ధి రేటు 10 శాతం త‌గ్గ‌గా, విగ‌తా నాలుగు సార్లు 5 శాతం కంటే త‌క్కువే న‌ష్ట‌పోయింది.

2014 నుంచి 2018 వ‌ర‌కు విశ్లేష‌ణ‌:

ఇదే కేసులో వివిధ కాల‌ప‌రిమితుల‌కు అనువ‌ధిస్తే, 45 సంవ‌త్స‌రాల వ‌య‌సు గ‌ల పెట్టుబ‌డుదారుడు జ‌న‌వ‌రి 1, 2014 నుంచి జూన్ 25, 2018 వ‌ర‌కు రూ.25 వేలు ప్ర‌తి జులై, జ‌న‌వ‌రి నెల‌ల్లో ఎన్‌పీఎస్ టైర్ -1 లో పెట్టుబ‌డులు పెడుతున్నాడు. జూన్ 25, 2018 నాటికి రూ.2.25 లక్ష‌ల పెట్టుబ‌డుల‌కు రూ.2.78 లక్ష‌లు జ‌మ‌య్యాయి. ఐఆర్ఆర్ 8.66 శాతం. ఇక్క‌డ గ‌మ‌నింద‌గిన‌ది ఏంటంటే మార్కెట్ల‌లో ఎలాంటి ఒడుదొడుకులు లేవు.

పోర్ట్ ఫోలియో 5 శాతానికి దిగువ‌కు ఎప్పుడూ చేర‌లేదు. గ‌రిష్టంగా 4.56 శాతానికి ప‌రిమిత‌మైంది. ఇది మ్యూచువ‌ల్ ఫండ్ పోర్ట్‌ఫోలియోతో పోలిస్త భిన్నంగా ఉంది. మొత్తం పెట్టుబ‌డులు రూ.2.25 లక్ష‌లు 10.33 శాతం వృద్ధితో రూ.2.89 ల‌క్ష‌ల‌కు, గ‌రిష్ఠంగా రూ.2.93 ల‌క్ష‌ల‌కు చేరాయి. కానీ ఇక్క‌డ రిస్క్ ఎక్కువ‌గా ఉంటుంది.

ఎన్‌పీఎస్‌లో చూస్తే…

ఎన్‌ప‌నీఎస్‌లో ఒక్కోసారి మార్కెట్ల ఒడుదొడుకుల‌ను బ‌ట్టి 5 శాతం న‌ష్ట‌పోయినా, ఒకేసారి 10 శాతం కంటే ఎక్కువ‌గా అయితే ప‌డిపోలేదు. గ‌రిష్ఠంగా 6.97 శాతంగా ఉంది. ఎన్‌పీఎస్‌తో పోలిస్తే కొంత ఒడుదొడుకులు ఎదుర్క‌కున్న‌ప్ప‌టికీ రాబ‌డి ఎక్కువ‌గా ఉంటుంది.

లార్జ్ క్యాప్‌, మిడ్ క్యాప్‌, ఈఎల్ఎస్ఎస్‌ ల‌లో సిప్ ద్వారా పెట్టుబ‌డులు పెడితే రాబ‌డులు ఎక్కువ‌గా ఉంటాయి కానీ కొంత రిస్క్ ఉంటుంది. పైన తెలిపిన ఉదాహ‌ర‌ణ‌లో ఐఆర్ఆర్ లార్జ్ క్యాప్‌, మిడ్ క్యాప్‌ల‌లో 12.37 శాతం, 15.82 శాతంగా ఉంది. ఈఎల్ఎస్ఎస్ 9.92 శాతంగా ఉంది. అదే మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో అయితే ఇదే కాలానికి ఇది 10.33 శాతంగా ఉంటుంది. గ‌రిష్ఠంగా లార్జ్ క్యాప్‌, మిడ్ క్యాప్ల‌లో న‌ష్టం 13.6 శాతంగా ఉంది.

దీన్ని బ‌ట్టి చూస్తే ఎన్‌పీఎస్‌ల‌లో న‌ష్టం ఇత‌ర వాటితో పోలిస్తే చాలా త‌క్కువ‌గా ఉంటుంది. అయితే సంప‌ద వృద్ధి కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో ఒడిదొడుకులు ఎన్‌పీఎస్ కంటే ఎక్కువ‌గా ఉంటుంది. ఎన్‌పీఎస్‌లో ఒడుదొడుకుల స‌మ‌యంలో న‌ష్టం 4.56 శాంగా ఉంటే మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో 6.97 శాతంగా ఉంటుంది. అయితే ఎన్‌పీఎస్ రాబ‌డి 8.66 శాతంగా ఉంటే మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో 10.33 శాతంగా ఉంటుంది.

ఈక్విటీల నుంచి అధిక రాబ‌డులు:

మొత్తంగా ఈక్విటీల‌లో పెట్టుబ‌డులు పెడితే 12.37 శాతం నుంచి 15.82 శాతం వ‌ర‌కు రాబ‌డినిస్తాయి. ఈఎల్ఎస్ఎస్‌లో ఇవి 9.92 శాతం. అయితే రిస్క్ కూడా అధికంగానే ఉంటుంది. గ‌రిష్ఠంగా న‌ష్టం 13.6 శాతం ఉంది, అయితే ఎన్‌పీఎస్‌లో ఇది 4.56 శాతంగా ఇదివ‌ర‌కు మ‌నం చూశాం. పెట్టుబ‌డులు ప్రారంభించాల‌నుకున్న‌ప్పుడు త‌క్కువ రిస్క్ తీసుకోవాల‌నుకుంటే ఎన్‌పీఎస్‌ను ఎంచుకోవ‌డం మేలు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని