డెట్ ఫండ్ల‌లో మ‌దుపుచేసేందుకు ఐదుకార‌ణాలు

ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్లలో మ‌దుపు చేసే వారు క్ర‌మంగా పెరుగున్న‌ప్ప‌టికి డెట్ ఫండ్ల విష‌యానికి వ‌స్తే ఆ ప‌రిస్థితి క‌న‌బ‌డ‌టం లేదు....

Published : 15 Dec 2020 16:20 IST

ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్లలో మ‌దుపు చేసే వారు క్ర‌మంగా పెరుగున్న‌ప్ప‌టికి డెట్ ఫండ్ల విష‌యానికి వ‌స్తే ఆ ప‌రిస్థితి క‌న‌బ‌డ‌టం లేదు. దీనికి కార‌ణం డెట్ ఫండ్ల‌పై స‌రైన అవ‌గాహ‌న లేక‌పోవ‌డం కార‌ణం కావ‌చ్చు. ఈ మ‌ధ్య‌నే 75 సంవ‌త్స‌రాల వ‌య‌సు నిండిన వ్య‌క్తి (సీనియ‌ర్ సిటిజ‌న్) ఆరోగ్య‌వంత‌మైన జీవితం గ‌డుపుతున్నాడు. అయితే పెరుగుతున్న ఖ‌ర్చులు, త‌గ్గుతున్న ఆదాయం మూలంగా కొంత దిగులు చెందాల్సి వస్తోంది. జీవించే కాలం పెరుగ‌తున్న‌కొల‌దీ ఎక్కువ డ‌బ్బులు అవ‌స‌ర‌మ‌వుతాయి. 15 ఏళ్ల క్రితం ప‌ద‌వీవిర‌మ‌ణ చేసిన‌పుడు వ‌డ్డీరేటు 9శాతం పైనే ఉండేవి. కానీ ప్ర‌స్తుతం ఆ ప‌రిస్థితి లేదు ఎందుకంటే వ‌డ్డీ రేటు త‌గ్గుతూపోతుంది. ప్ర‌స్తుతం వ‌చ్చే 8 శాతం కూడా భ‌విష్య‌త్తులో త‌గ్గిపోవ‌చ్చు. ఈ ప‌రిస్థితి దాచుకున్న మొత్తంపై వ‌చ్చేరాబ‌డిపై ఆధార‌ప‌డే వారికి ఇబ్బందిక‌ర‌మ‌నే చెప్పాలి.

మూడు వైపుల‌ నుంచి ఒకేసారి స‌మ‌స్య‌లు రానున్నాయ‌నే చెప్పాల్సి ఉంటుంది. ఒక‌టి త‌గ్గుతున్న వ‌డ్డీరేట్ల‌కు అనుగుణంగా ఆదాయం త‌గ్గితుండ‌టం, రెండోది జీవించేకాలం పెరుగుతుండ‌టం. మూడోది ఖ‌ర్చులు పెరుగుతుండ‌టం. వీటిని ఎదుర్కొనేందుకు మ‌రిన్ని కొత్త పెట్టుబ‌డి అవ‌కాశాల‌ను అన్వేషించాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. కొత్త‌గా మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో మ‌దుపుచేసే వారు ఎక్కువ మంది సిప్ ద్వారా ఈక్విటీలో పెట్టుబ‌డి పెడుతున్నారు, కానీ డెట్ ఫండ్లలో ఆ జోరు లేద‌నే చెప్పాలి.

తాజా గ‌ణాంకాలు ప‌రిశీలిస్తే

  • మ్యూచువ‌ల్ ఫండ్లో వివిధ వ‌ర్గాల‌కు చెందిన మ‌దుప‌ర్ల పెట్టుబ‌డులు ఏప్రిల్ 2017 నాటికి
    80 శాతం ఈక్విటీ పెట్టుబ‌డులు వ్య‌క్తిగ‌త‌ మ‌దుప‌ర్లు (రిటైల్ మ‌దుప‌ర్లు 47%, హెచ్ఎన్ఐలు 33%) చేయగా మిగిలిన 20శాతం సంస్థాగ‌త మ‌దుప‌ర్లు చేశారు.
  • ఇది డెట్ ఫండ్ల‌లో విష‌యంలో వేరేగా ఉంది. 73శాతం పెట్టుబ‌డులు సంస్థాగ‌త మ‌దుప‌ర్లు చేయ‌గా కేవ‌లం 27శాతం పెట్టుబ‌డిని (రిటైల్ మ‌దుప‌ర్లు 47%, హెచ్ఎన్ఐలు33%) మాత్ర‌మే వ్య‌క్తిగ‌త మ‌దుప‌ర్లు క‌లిగి ఉన్నారు.
  • మ్యూచువ‌ల్ ఫంవ‌డ్ల విష‌యంలో మాత్రం భార‌తీయ మ‌దుప‌ర్లు కొంత రిస్క్ తీసుకునేవిధంగానే ఉన్నారు. ఎలా అంటే త‌క్కువ న‌ష్ట‌భ‌యం ఉండే డెట్ ఫండ్ల‌లో నిర్వ‌హ‌ణ‌లో ఉన్న ఆస్తులు రూ. 78,697కోట్లుగా ఉంటే కొంత న‌ష్ట‌భ‌యం ఉండే ఈక్విటీ ఫండ్ల‌లో రూ.3,22,287 కోట్లు ఉన్నాయి.

డెట్ ఫండ్ల‌లో మ‌దుపు చేస్తే కలిగే లాభాలు వివ‌రించే ఐదు కార‌ణాలు

కాల‌ప‌రిమితి:

రాబ‌డి హామీతో కూడిన ప‌థ‌కాల‌తో పోలిస్తే డెట్ ప‌థ‌కాల్లో వివిధ ర‌కాల కాల‌ ప‌రిమితుల్లో ఉంటాయి. లిక్విడ్ ఫండ్లు మూడు నెల‌ల నుంచి ఏడాది లోపు పెట్టుబ‌డి చేసేందుకు అనువైన‌వి. ఆల్ట్రా షార్ట్ ట‌ర్మ్ ఫండ్లు వీటి కాల‌ప‌రిమితి మూడు నెల‌ల నుంచి ఏడాది వ‌ర‌కూ ఉంటుంది. షార్ట్ ట‌ర్మ్ బాండ్ ఫండ్లు1-2 సంత్స‌రాల కాల‌ప‌రిమితితో ల‌భిస్తాయి. వీటిలో ఇంకా డెట్ ఫండ్లు మ‌ధ్య‌స్థంగా ఉండేవి 2-3 సంవ‌త్స‌రాలు, దీర్ఘ‌కాలం అయితే 3-5 సంవ‌త్స‌రాలు కాల‌ప‌రిమితితో ఉంటాయి. సాధార‌ణ బ్యాంకు ఖాతాలో ఉంచుకుంటే ల‌భించే వ‌డ్డీ శాతం 4 కంటే డెట్ ఫండ్ల‌ను ఎంచుకోవ‌డం మంచిది.

ప‌న్నుచెల్లింపులు:

సాంప్ర‌దాయ డెట్ రాబ‌డి ప‌థ‌కాల్లో ప్ర‌తీ ఏడాది మ‌దుప‌రి స్లాబు రేటు వ‌ద్ద‌ ప‌న్నుచెల్లించాల్సి ఉంటుంది. డెట్ ఫండ్ల‌లో మూల‌ధ‌న రాబ‌డిపై మాత్ర‌మే ప‌న్ను చెల్లించాలి. స్వ‌ల్ప‌కాల మూల‌ధ‌న ఆదాయం మ‌దుప‌ర్ల వారి స్లాబు రేటు ప్ర‌కారం ఉంటుంది. డెట్ ఫండ్లో మ‌దుపు మూడేళ్లకు పైబ‌డి చేస్తే దీర్ఘ‌కాల రాబ‌డి పై మాత్రం 20శాతం (ఇండెక్సేష‌న్) ప‌న్ను చెల్లించాల్సి ఉంటుంది.

ఉదాహ‌ర‌ణ‌కు: మీరు డెట్ ఫండ్ల ద్వారా 9శాతం రాబ‌డిని ఆర్జించారు అనుకుందాం. అప్ప‌టికీ ద్ర‌వ్యోల్బ‌ణం రేటు 5 శాతంగా ఉంది. అప్పుడు మీరు అద‌నంగా పొందిన 4 శాతానికి మాత్ర‌మే ప‌న్ను చెల్లించాలి. ఇండెక్సేష‌న్ ద్వారా ల‌భించే ఈ స‌దుపాయం సీఐఐ గ‌ణాంకాల ప్ర‌కారం ఉంటుంది. ఒక వేళ డెట్ ఫండ్లు, బ్యాంక్ డిపాజిట్లు ఒకే విధ‌మైన రాబ‌డిని ఇచ్చిన‌ప్ప‌టికీ ప‌న్ను త‌ర్వాత ఆదాయం డెట్ ఫండ్ల‌లో ఎక్కువ ఉంటుంది.

క్ర‌మ‌మైన రాబ‌డి:

వ‌డ్డీ రేట్లు త‌గ్గుతున్న ప‌రిస్థితుల్లో క్ర‌మంగా ఆదాయం పొందేందుకు డెట్ ఫండ్లు ఉప‌యోగ‌క‌రంగా ఉంటాయి. ఉదాహ‌ర‌ణ‌కు ఒక మ‌దుప‌రి రూ.25ల‌క్ష‌ల‌ను ఏడాదికి 9శాతం వ‌డ్డీకి బ్యాంకు డిపాజిట్ చేశార‌నుకుందాం. దీని మూలంగా అత‌నికి ప్ర‌తీ నెల రూ.18,750 ల‌భిస్తుంది. ఆ వ్య‌క్తి 30శాతం ఆదాయ‌ప‌న్నుస్లాబులో ఉన్న‌ట్ల‌యితే దాదాపు రూ.5600ప‌న్ను చెల్లించాలి. ప‌న్నుత‌ర్వాత ల‌భించే ఆదాయం రూ.13,100 అవుతుంది. అదే డెట్ ఫండ్ల‌లో సిస్ట‌మేటిక్ విత్‌డ్రాయ‌ల్ ప్లాన్ ను ఎంచుకున్న‌ట్ల‌యితే మూల‌ధ‌న రాబ‌డిపై త‌క్కువ ప‌న్ను చెల్లించే అవ‌కాశం ఉంటుంది.

వైవిధ్య‌త‌:

డెట్ ఫండ్లు వివిధ ర‌కాల ప‌థ‌కాల్లో మ‌దుపుచేస్తాయి. ఈక్విటీ ఫండ్ల‌తో పోలిస్తే వీటిపై మ‌దుప‌ర్ల‌కు వ‌చ్చే రాబ‌డి నిల‌క‌డ‌గా ఉంటుంది. పోర్టిఫోలియో వైవిధ్య‌త మూలంగా న‌ష్ట‌భ‌యం త‌గ్గి రాబ‌డి స్థిరంగా ఉంటుంది.

అనుకూల‌త‌:

ఒక మ‌దుప‌రి ద‌గ్గ‌ర ఎక్కువ మొత్తంలో నిధుల ఉన్నాయ‌నుకుందాం. అత‌నికి ఈక్విటీలో ఎప్పుడు మ‌దుపుచేయాలో తెలియ‌దు. సిప్ విధానం దీనికి క‌చ్చితంగా స‌రిపోతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. దీని మూలంగా రూపీ కాస్ట్ ఏవ‌రేజింగ్ అవుతుంది. సేవింగ్సు బ్యాంకు ఖాతాలో వ‌చ్చే 4శాతం ఆదాయం పొందడం స‌బ‌బేనా? స‌రిగ్గా ఇక్క‌డే డెట్ ఫండ్ల‌తో మ‌దుప‌ర్లు ల‌బ్ధిపొందొచ్చు. అదెలా అంటే సిస్ట‌మేటిక్ ట్రాన్స‌ఫ‌ర్ ప్లాన్ ద్వారా డెట్ ఫండ్ల‌లో పెట్టుబ‌డిని ఈక్విటీ ప‌థ‌కంలోకి క్ర‌మంగా మ‌దుపుచేసుకోవ‌చ్చు. ఒక డెట్ ఫండ్ కు ఎన్ని సిస్ట‌మేటిక్ ట్రాన్స‌ఫ‌ర్ ప్లాన్ల‌నైనా పెట్టుకోవ‌చ్చు.

చివ‌ర‌గా

మ‌దుప‌ర్లు కొంత మ‌దుపును డెట్ ఫండ్లలో పెట్టుబ‌డి చేయ‌డంపై ఆలోచించాలి. అయితే మ‌దుపుచేసే ముందు ఆయా ప‌థ‌కాల‌ను బాగా అర్థం చేసుకోవాలి. ఆర్థిక‌స‌ల‌హాదారుని సంప్ర‌దించి త‌గిన నిర్ణ‌యం తీసుకోవాలి.వీటిలో ఉండే క్రెడిట్ రిస్క్, వ‌డ్డీరేటు రిస్క్ ల‌పై అవ‌గాహ‌న ఏర్ప‌రుచుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని