ఉద్యోగులకు ఉచితంగా వ్యాక్సిన్‌: మైండ్‌ ట్రీ, సిఫీ

ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు అయ్యే కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ ఖర్చులను భరించనున్నట్లు ఐటీ సంస్థలు మైండ్‌ ట్రీ, సిఫీ టెక్నాలజీస్‌ ప్రకటించాయి. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం.. ఉద్యోగులు, కుటుంబ సభ్యులకు కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ అందించనున్నట్లు

Updated : 09 Mar 2021 10:46 IST

దిల్లీ: ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు అయ్యే కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ ఖర్చులను భరించనున్నట్లు ఐటీ సంస్థలు మైండ్‌ ట్రీ, సిఫీ టెక్నాలజీస్‌ ప్రకటించాయి. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం.. ఉద్యోగులు, కుటుంబ సభ్యులకు కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ అందించనున్నట్లు మైండ్‌ట్రీ చీఫ్‌ పీపుల్‌ ఆఫీసర్‌ పనీశ్‌ రావు తెలిపారు. దేశంలో ఉన్న ఉద్యోగులు ఈ సేవలను పొందగలరని, ఉద్యోగులకు వ్యాక్సిన్‌ అందించడం తమ బాధ్యతగా భావిస్తున్నట్లు వివరించారు. ఇక అధిక వయసు కలిగిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో వ్యాక్సిన్‌ అందించనున్నట్లు ఐసీటీ సేవలు, సొల్యూషన్ల సంస్థ సిఫీ తెలిపింది. ఇప్పటికే ఇన్ఫోసిస్‌, అసెంచర్‌, క్యాప్‌జెమినీ, రిలయన్స్‌, టీవీఎస్‌ వంటి దిగ్గజ కంపెనీలు ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల వ్యాక్సిన్‌ ఖర్చులను భరించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.


సెబీ ప్రత్యేక ఖాతాదారు కోడ్‌, పాన్‌ నిబంధనల సడలింపు

దిల్లీ: కమొడిటీ డెరివేటివ్స్‌ విభాగం కలిగిన ఎక్స్ఛేంజీలు తమ సభ్యుల ఖాతాదారులకు సంబంధించిన పాన్‌ వివరాల సేకరణ, నిర్వహణకు అవసరమైన నిబంధనలను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ సడలించింది. 2020 బడ్జెట్‌లో తక్షణ పాన్‌ సదుపాయాన్ని ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ఐటీ శాఖ ఆధార్‌ ఆధారిత ఇ-కేవైసీ ద్వారా ఇ-పాన్‌ పొందే సదుపాయాన్ని తీసుకొచ్చింది. ప్రత్యేక ఖాతాదారు కోడ్‌ (యూసీసీ), పాన్‌ తప్పనిసరికి సంబంధించిన నిబంధనలను సడలించినట్లు సెబీ పేర్కొంది. కమొడిటీ డెరివేటివ్‌ విభాగంలో చేసే లావాదేవీలకు ఖాతాదారులు యూసీసీ వినియోగించడం తప్పనిసరని తెలిపింది.
* తమ స్మార్ట్‌ఫోన్లలో కెమేరాల సామర్థ్యాన్ని మరింతగా పెంచి, వినియోగదారులకు మరిన్ని ప్రత్యేకతలను అందుబాటులోకి తెచ్చేందుకు రాబోయే మూడేళ్లలో 150 మిలియన్‌ డాలర్లకు పైగా పెట్టుబడులను పెట్టే ఉద్దేశంలో ఉన్నట్లు వన్‌ప్లస్‌ వెల్లడించింది. అలాగే తదుపరి తరం స్మార్ట్‌ఫోన్‌ కెమేరా వ్యవస్థలను అభివృద్ధి చేసే నిమిత్తం కెమేరాల తయారీ సంస్థ హజెల్‌బ్లాడ్‌తో మూడేళ్ల భాగస్వామ్య ఒప్పందాన్ని కూడా కుదుర్చుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని