Petrol Diesel Price: రికార్డు స్థాయికి పెట్రో ధరలు!

దేశంలో ఇంధన ధరల పెంపు ఆగడం లేదు. రోజురోజుకీ ఎగబాకుతున్న ధరలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బండి బయటకు తీయాలంటేనే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది.....

Updated : 31 Oct 2021 10:38 IST

దిల్లీ: దేశంలో ఇంధన ధరల పెంపు ఆగడం లేదు. రోజురోజుకీ ఎగబాకుతున్న ధరలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బండి బయటకు తీయాలంటేనే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పైగా ఇంధన ధరలు పెరగడంతో రవాణా, సరఫరా ఖర్చులు పెరిగి ఇతర నిత్యావసర వస్తువుల ధరలపైనా ఆ ప్రభావం పడుతోంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీగా పెరగడంతో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ భయాలు అలముకుంటున్నాయి.

దేశవ్యాప్తంగా వరుసగా ఐదోరోజైన ఆదివారమూ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. దీంతో ప్రధాన నగరాలన్నింటిలో ధరలు రికార్డు స్థాయికి చేరాయి. పెట్రోల్‌, డీజిల్‌ రెండింటిపై లీటరుకు 35 పైసల చొప్పున పెరిగింది. దీంతో దేశ రాజధాని దిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.109.34కి చేరింది. వాణిజ్య రాజధాని ముంబయిలో ఈ ధర రూ. 115.15గా ఉంది. ఇప్పటికే దేశంలో కొన్ని ప్రాంతాల్లో లీటర్‌ పెట్రోల్‌ ధర ఏకంగా రూ.120కి చేరిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.113.72గా ఉంది. అత్యధికంగా రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌ పట్టణంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.121.62గా ఉంది. అక్కడ డీజిల్‌ ధర రూ.112.52గా నమోదైంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో చమురు ధరలు ఇలా..

దిల్లీ - పెట్రోల్‌ రూ.109.34, డీజిల్‌ రూ.98.07

ముంబయి - పెట్రోల్‌ రూ.115.15, డీజిల్‌ రూ.106.23

చెన్నై - పెట్రోల్‌ రూ.106.04, డీజిల్‌ రూ.102.25

కోల్‌కతా - పెట్రోల్‌ రూ.109.79, డీజిల్‌ రూ.101.19

బెంగళూరు - పెట్రోల్‌ రూ.113.15, డీజిల్‌ రూ.104.09

హైదరాబాద్‌ - పెట్రోల్‌ రూ.113.72, డీజిల్‌ రూ.106.98


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని