పేమెంట్ గేట్‌వేస్‌తో వ్యాపారం మ‌రింత సుల‌భం...సుర‌క్షితం

డ‌బ్బుఅనేది ఎంత అవ‌స‌ర‌మో మ‌నంద‌రికీ తెలుసు. అయితే కాలం మారుతున్నాకొద్ది డ‌బ్బు చేతిలో ఉండాల్సిన అవ‌స‌రం లేకుండా అన్నింటికి ఆన్‌లైన్ చెల్లించే స‌దుపాయం అందుబాటులోకి వ‌చ్చింది. దీంతో వ్య‌క్తుల‌కు, సంస్థ‌ల‌కు చాలా ప్ర‌యోజ‌నాలు ఏర్ప‌డ్డాయి డిజిట‌ల్ చెల్లింపులు ప్రోత్స‌హించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌తో, ముఖ్యంగా నోట్ల ర‌ద్దు త‌ర్వాత నుంచి ..

Published : 18 Dec 2020 14:51 IST

డ‌బ్బుఅనేది ఎంత అవ‌స‌ర‌మో మ‌నంద‌రికీ తెలుసు. అయితే కాలం మారుతున్నాకొద్ది డ‌బ్బు చేతిలో ఉండాల్సిన అవ‌స‌రం లేకుండా అన్నింటికి ఆన్‌లైన్ చెల్లించే స‌దుపాయం అందుబాటులోకి వ‌చ్చింది. దీంతో వ్య‌క్తుల‌కు, సంస్థ‌ల‌కు చాలా ప్ర‌యోజ‌నాలు ఏర్ప‌డ్డాయి డిజిట‌ల్ చెల్లింపులు ప్రోత్స‌హించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌తో, ముఖ్యంగా నోట్ల ర‌ద్దు త‌ర్వాత నుంచి డిజిట‌ల్ చెల్లింపులు బాగా పెరిగిపోయాయి. ఆధార్‌ను అన్ని సేవ‌ల‌కు త‌ప్ప‌నిస‌రి చేయ‌డం కూడా ఇందులో భాగ‌మే. భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను న‌గ‌దు ర‌హితంగా మార్చేందుకు బ్యాంకులు కూడా మొబైల్ బ్యాంకింగ్ యాప్స్ అందుబాటులోకి తీసుకొచ్చాయి. దీంతో డ‌బ్బు చేతిలో ఉండాల్సిన అవ‌స‌రం లేదు, అదేవిధంగా సుల‌భంగా క్ష‌ణాల్లో చెల్లింపులు చేసుకోవ‌చ్చు.

డిజిట‌ల్ చెల్లింపులు పెర‌గ‌డంతో ఆన్‌లైన్ బిజినెస్ కూడా పెరిగిపోయింది. ఎలాంటి మోసాలు జ‌ర‌గ‌కుండా ఆన్‌లైన్ ద్వారా వ్యాపారం చేసుకునే అవ‌కాశం ఉంది. వ్యాపారానికి అనుగుణంగా ఉండే అడ్వాన్స్‌డ్ టెక్నాల‌జీతో కూడిన కొన్ని పేమెంట్ గేట్‌వేస్‌ను గురించి తెలుసుకుందాం…

ఆర్టిఫీషియ‌ల్ ఇంట‌లీజెన్స్ (AI) తో కూడిన‌ టీఈఎల్ఆర్ సెక్యూర్ (Telr Secure)

ఆర్టిఫీషియ‌ల్ ఇంట‌లీజెన్స్, ఆన్‌లైన్ లావాదేవీల‌కు ర‌క్ష‌ణ క‌వ‌చంలా ప‌నిచేస్తోంది. ఈ సాంకేతిక‌తో ఎలాంటి హ్యాకింగ్‌లు, మోసాల‌కు తావుండ‌దు. టీఈఎల్ఆర్ సెక్యూర్ ఆర్టిఫీషియ‌ల్ ఇంట‌లీజెన్స్ క‌లిగి ఉండ‌టంతో మీ డేటా చాలా సుర‌క్షితంగా ఉంటుంది. ఇది ఆన్‌లైన్ లావాదేవీలు పెరిగేందుకు హామినిస్తోంది.

బ‌హుళ భాషా, క‌రెన్సీ సదుపాయం: సీసీ ఎవెన్యూ (CCAvenue)

సీసీ ఎవ‌న్యూ బ‌హుళ భాషా స‌దుపాయం క‌లిగి ఉంటంతో పాటు అన్ని ర‌కాల క‌రెన్సీల చెల్లింపుల‌కు అవ‌కాశ‌ముంది. వ్యాపారస్తుల‌కు ఇది ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది. ఇందులో 27 దేశాల క‌రెన్సీతో చెల్లించుకోవ‌చ్చు. అదేవిధంగా 18 భార‌తీయ‌, ప్ర‌పంచ భాష‌ల్ని క‌లిగి ఉండ‌టంతో ప్ర‌పంచంలో ఎక్క‌డ‌నుంచైనా దీనిని ఉప‌యోగించుకోవ‌చ్చు.

ఆటోమేటిక్ ఓటీపీ : రేజ‌ర్ పే (RazorPay)

ఆన్‌లైన్ లావాదేవీలు జ‌రిపేట‌ప్పుడు వెరిఫికేష‌న్ కోసం ఓటీపీ వ‌స్తుంది. అయితే రేజ‌ర్‌పే ద్వారా ఓటీపీ ఎంట‌ర్ చేయాల్సిన అవ‌స‌రం లేకుండా అదే ఆటోమేటిక్‌గా ఓటీపీ తీసుకునే విధంగా రూపొందించారు. దీంతో చెల్లింపులు మ‌రితం సుల‌భంగా పూర్త‌వుతాయి.

సీవీవీ లేకుండా లావాదేవీలు : పేయూబిజ్(PayUBiz)

ఆన్‌లైన్ లావాదేవీలు చేసేట‌ప్పుడు కార్డు వివ‌రాల‌ను ఎంట‌ర్ చేయ‌డం వంటివి సాధార‌ణంగా ఉంటాయి. అయితే పేయూబిజ్ ద్వారా అలాంటి అవ‌స‌రం లేకుండా ఈ గేట్‌వే ద్వారా ఎక్క‌వ‌సార్లు చెల్లింపులు చేసిన వినియోగ‌దారుల‌కు ఆటోమేటిక్‌గా సీవీవీ అవ‌స‌రం లేకుండా చెల్లింపులు చేసుకోవ‌చ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని