Godavari Biorefineries IPO: ఐపీఓకి గోదావరి బయోరిఫైనరీస్‌ దరఖాస్తు

గోదావరి బయోరిఫైనరీస్‌ అనే కంపెనీ ఐపీఓకి దరఖాస్తు చేసుకుంది. ఈ మేరకు కావాల్సిన పత్రాలను సెబీకి సమర్పించింది. ...

Published : 25 Sep 2021 18:54 IST

దిల్లీ: గోదావరి బయోరిఫైనరీస్‌ అనే కంపెనీ ఐపీఓకి దరఖాస్తు చేసుకుంది. ఈ మేరకు సంబంధిత పత్రాలను సెబీకి సమర్పించింది. ఇష్యూలో భాగంగా రూ.370 కోట్లు విలువ చేసే తాజా షేర్లతో పాటు.. 65,58,278 ఈక్విటీ షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌(ఓఎఫ్‌ఎస్‌) కింద విక్రయించనున్నారు. ఓఎఫ్‌ఎస్‌లో భాగంగా సామిర్‌ శాంతిలాల్‌ సోమయ, సోమయ ఏజెన్సీస్‌ చెరో ఐదు లక్షల షేర్లు, మండల క్యాపిటల్‌ 49.27 లక్షల షేర్లు, ఫిల్మీడియా కమ్యూనికేషన్‌ సిస్టమ్స్‌ మూడు లక్షల షేర్లు, సోమయ ప్రాపర్టీస్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ 1.31 లక్షల షేర్లు, లక్ష్మీవాడీ మైన్స్‌ అండ్‌ మినరల్స్‌ రెండు లక్షల షేర్లను విక్రయించనుంది. అయితే కంపెనీ ప్రీ-ఐపీఓ ప్లేస్‌మెంట్‌కి కూడా ప్రయత్నాలు చేస్తోంది. ఒకవేళ అందులో సఫలమైతే.. ఐపీఓకి వచ్చే తాజా షేర్ల సంఖ్య తగ్గే అవకాశం ఉంది.

ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను రుణ చెల్లింపులకు వినియోగించనున్నారు. అలాగే కొంతమొత్తాన్ని వ్యాపార విస్తరణకు ఉపయోగించనున్నారు. భారత్‌లో ఇథనాల్‌ ఉత్పత్తి చేస్తున్న ప్రధాన సంస్థలో గోదావరి బయోరిఫైనరీస్‌ ఒకటి. ఇథనాల్‌, బయో ఆధారిత రసాయనాలు, షుగర్లు, రెక్టిఫైడ్‌ స్పిరిట్లు, ఇతర గ్రేడ్ల ఆల్కాహాల్‌నూ ఉత్పత్తి చేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని