Gold Imports: భారీగా పెరిగిన పసిడి దిగుమతులు

ఏప్రిల్‌-సెప్టెంబరు మధ్య దేశంలో పసిడి దిగుమతులు భారీగా పెరిగి 24 బిలియన్‌ డాలర్ల(రూ.58,572.99 కోట్లు)కు చేరుకున్నాయి....

Published : 17 Oct 2021 21:23 IST

దిల్లీ: ఏప్రిల్‌-సెప్టెంబరు మధ్య దేశంలో పసిడి దిగుమతులు భారీగా పెరిగి 24 బిలియన్‌ డాలర్ల(రూ.58,572.99 కోట్లు)కు చేరుకున్నాయి. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో ఇవి 6.8 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. అలాగే క్రితం ఏడాది సెప్టెంబరు నెలలో 601.4 మిలియన్‌ డాలర్లుగా ఉన్న బంగారం దిగుమతులు ఈ ఏడాది సెప్టెంబరులో 5.11 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి.

వెండి దిగుమతులు ఏప్రిల్‌-సెప్టెంబరులో 15.5 శాతం తగ్గి 619.3 మిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. గత ఏడాది సెప్టెంబరు నెల(9.23 మిలియన్‌ డాలర్లు)తో పోలిస్తే ఈ ఏడాది అదే నెలలో వెండి దిగుమతులు 552.33 మిలియన్‌ డాలర్లకు పెరిగాయి. పసిడి దిగుమతులు భారీగా పెరగడంతో దేశ వాణిజ్య లోటు గత నెలలో 22.6 బిలియన్‌ డాలర్లకు చేరింది. ఏటా భారత్‌ 800-900 టన్నుల పసిడిని దిగుమతి చేసుకుంటుందన్న విషయం తెలిసిందే. మరో వైపు, రత్నాభరణాల ఎగుమతులు ఏప్రిల్‌-సెప్టెంబరులో 8.7 బి. డాలర్ల నుంచి 19.3 బిలియన్‌ డాలర్లకు చేరాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని