HDFC Bank: నెలలోనే 4 లక్షల కొత్త కార్డుల జారీ 

క్రెడిట్‌ కార్డుల మార్కెట్లో తమ వాటాను తిరిగి సాధించేందుకు

Published : 30 Sep 2021 12:48 IST

ఈనాడు, హైదరాబాద్‌: క్రెడిట్‌ కార్డుల మార్కెట్లో తమ వాటాను తిరిగి సాధించేందుకు ప్రయత్నిస్తున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ వెల్లడించింది. అనేకసార్లు సాంకేతిక సమస్యలు తలెత్తుండటంతో కొత్త క్రెడిట్‌ కార్డులు జారీ చేయకుండా గత డిసెంబరులో ఈ బ్యాంకుపై ఆర్‌బీఐ నిషేధం విధించింది. తిరిగి ఆగస్టు మధ్యలో కార్డుల జారీ చేసేందుకు అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో స్వల్ప కాలంలోనే (సెప్టెంబరు 21 నాటికి) నాలుగు లక్షలకు పైగా కొత్త క్రెడిట్‌ కార్డులను ఖాతాదారులకు జారీ చేసినట్లు బ్యాంకు డిజిటల్‌ బ్యాంకింగ్, ఐటీ, పేమెంట్స్‌ హెడ్‌ పరాగ్‌ రావు తెలిపారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని