కార్డు ర‌హిత ఈఎమ్ఐ సేవ‌ల‌ను ప్రారంభించిన ఐసీఐసీఐ

కార్డు ర‌హిత ఈఎమ్ఐ స‌దుపాయాన్ని ప్రారంభించిన‌ట్లు ఐసీఐసీఐ బ్యాంక్ నేడు ప్ర‌క‌టించింది. ‘ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్‌లెస్ ఈఎమ్‌ఐ’ అనేది ప్ర‌ముఖ రిటైల్ స్టోర్ల వ‌ద్ద పూర్తి స్థాయిలో డిజిట‌ల్ చెల్లింపులు చేసే విధానం. ఈ స‌దుపాయం ద్వారా బ్యాంక్ నుంచి ముందుగా ఆమోదం పొందిన వినియోగ‌దారులు వ్యాలెట్‌, కార్డుల‌కు బ‌దులు వారి మొబైల్ ఫోన్‌, పాన్ ల‌ను..

Updated : 01 Jan 2021 19:23 IST

కార్డు ర‌హిత ఈఎమ్ఐ స‌దుపాయాన్ని ప్రారంభించిన‌ట్లు ఐసీఐసీఐ బ్యాంక్ నేడు ప్ర‌క‌టించింది. ‘ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్‌లెస్ ఈఎమ్‌ఐ’ అనేది ప్ర‌ముఖ రిటైల్ స్టోర్ల వ‌ద్ద పూర్తి స్థాయిలో డిజిట‌ల్ చెల్లింపులు చేసే విధానం. ఈ స‌దుపాయం ద్వారా బ్యాంక్ నుంచి ముందుగా ఆమోదం పొందిన వినియోగ‌దారులు వ్యాలెట్‌, కార్డుల‌కు బ‌దులు వారి మొబైల్ ఫోన్‌, పాన్ ల‌ను ఉప‌యోగించి త‌మ‌కు న‌చ్చిన గ్యాడ్జెట్లు, గృహోక‌ర‌ణాల‌ను కొనుగోలు చేయోచ్చు. రిటైల్ దుకాణాలు, పాన్‌-ఇండియా అవుట్‌లెట్ల‌లో కార్డు ర‌హిత, పూర్తి స్థాయి డిజిట‌ల్ ఈఎమ్ఐ స‌దుపాయాన్ని ప్ర‌వేశ‌పెట్టిన మొట్టమొద‌టి బ్యాంక్ ఐసీఐసీఐ. ఇందుకోసం ప్ర‌ముఖ‌‌ మర్చంట్ కామర్స్ ప్లాట్‌ఫామ్- పైన్ ల్యాబ్స్‌తో బ్యాంక్ ఒప్పందం కుదుర్చుకుంది.

“గృహోప‌క‌ర‌ణాలు, మొబైల్ ఫోన్లు, గ్యాడ్జెట్లు ఈఎమ్ఐలో కొనుగోలు చేడ‌యం భార‌తీయుల‌కు తెలిసిన విధాన‌మే. చాలామంది వినియోగ‌‌దారులు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుల‌పై ల‌భించే ఈఎమ్ఐ స‌దుపాయంతో వినియోగ వ‌స్తువుల‌ను కొనుగోలు చేయ‌డం మేము గ‌మ‌నించాం. దీనికి అద‌న‌పు సౌల‌భ్యాన్ని క‌ల్పిస్తూ కార్డుర‌హిత ఈఎమ్ఐ స‌దుపాయాన్ని ప‌రిచ‌యం చేస్తున్నాం. దీంతో వినియోగ‌దారులు కార్డులు, వ్యాలెట్‌ల‌ను ప్ర‌క్క‌న పెట్టి, త‌మ మొబైల్‌, పాన్ ల‌ను ద్వారా లావాదేవీలు చేయోచ్చు.” అని ఐసీఐసీఐ బ్యాంక్ అన్‌సెక్యూర్డ్ అసెట్స్ హెడ్ సుదీప్తా రాయ్ తెలిపారు.

కార్డు ర‌హిత ఈఎమ్ఐ విధానం రూపొందించ‌డం, అభివృద్ధి చేయ‌డం చాలా క‌ష్టం. అయితే ఇది చాలా సుర‌క్షితం. ఇది షాప్‌-నౌ- పే-లేట‌ర్ విధానంలో కొనుగోలు చేసేందుకు వినియోగ‌దార‌లకు నూత‌న ఉత్సాహ‌న్ని ఇస్తుందని ఆశిస్తున్న‌ట్లు పైన్ లాబ్స్ సంస్థ తెలిపింది.

ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులెస్ ఈఎమ్ఐతో ప్ర‌యోజ‌నాలు:

  • కార్డు ఉపయోగించ‌కుండా నో-కాస్ట్ ఈఎమ్ఐ స‌దుపాయం
  • జిరో ప్రాసిసెంగ్ ఫీజు
  • ప్రాసెస్ మొత్తం డిజిట‌ల్ , కాంటాక్ట్ లెస్ విధానంలో ఉండ‌డంతో పాటు పూర్తి స్థాయి భద్ర‌త ల‌భిస్తుంది.
  • కోనుగోళ్ళు చేసేందుకు వినియోగదారులు రూ.10 వేల నుంచి రూ. 10 లక్షల వరకు ముందస్తు అనుమతి పొందవచ్చు.
  • వినియోగదారులు 3 నుంచి 15 నెల‌ల వ‌ర‌కు తమకు నచ్చిన కాలప‌రిమితిని ఎంచుకోవచ్చు

కార్డు ర‌హిత ఈఎమ్ఐ స‌దుపాయం పొందే విధానం:

  • న‌చ్చిన వ‌స్తువును స్టోర్ వ‌ద్ద ఎంచుకోవాలి.
  • కార్డు ర‌హిత ఈఎమ్ఐకు సుముఖంగా ఉన్న‌ట్లు స్టోరు ప్ర‌తినిధికి తెలియ‌జేయాలి.
  • పాయింట్ ఆఫ్ సేల్(పీఓఎస్‌) టెర్మిన‌ల్ వ‌ద్ద బ్యాంక్‌లో న‌మోదు చేసుకున్న మొబైల్ నెంబ‌రు, పాన్ ఎంట‌ర్ చేస్తే, మొబైల్ నెంబ‌రుకు ఓటీపీ వ‌స్తుంది. ఓటీపీని పీఓఎస్‌ టెర్మిన‌ల్‌లో ఎంట‌ర్ చేయాల్సి ఉంటుంది.
  • అంతే ఈ ద‌శ‌లో ఎటువంటి ఆల‌స్యం లేకుండా లావాదేవీలు ఆమోదిస్తారు.

కార్డు ర‌హిత ఈఎమ్ఐ అర్హ‌త‌ను తెలుసుకోవ‌డం ఎలా?

ఐసిఐసిఐ బ్యాంక్ కస్టమర్లు కార్డ్‌లెస్ ఈఎమ్ఐ త‌మ‌కు వ‌ర్తిస్తుందో లేదో తెలుసుకునేందుకు ‘CF’ అని టైప్ చేసి ‘5676766’ కు ఎస్ఎంఎస్ పంపడం ద్వారా లేదా ఐమొబైల్ యాప్‌లోని ఆఫర్ల విభాగాన్ని తనిఖీ చేయవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని