ఇక‌పై సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు రూ.50 వేల వ‌ర‌కు టీడీఎస్ లేదు

సాదార‌ణంగా వార్షిక‌ వడ్డీ ఆదాయం రూ .10 వేల‌కు మించిన ప‌న్ను చెల్లింపుదారుల‌కు టీడీఎస్ వ‌ర్తిస్తుంది. మీరు సినియ‌ర్ సిటిజ‌న్‌నా? మీ వార్షిక వ‌డ్డీ ఆదాయం రూ.50 వేల లోపు ఉన్నా మీ బ్యాంకు టీడీఎస్ డిడ‌క్ట్ చేస్తుందా? అయితే ఈ శుభ‌వార్త మీ కోస‌మే...

Published : 25 Dec 2020 16:02 IST

సాదార‌ణంగా వార్షిక‌ వడ్డీ ఆదాయం రూ .10 వేల‌కు మించిన ప‌న్ను చెల్లింపుదారుల‌కు టీడీఎస్ వ‌ర్తిస్తుంది. మీరు సినియ‌ర్ సిటిజ‌న్‌నా? మీ వార్షిక వ‌డ్డీ ఆదాయం రూ.50 వేల లోపు ఉన్నా మీ బ్యాంకు టీడీఎస్ డిడ‌క్ట్ చేస్తుందా? అయితే ఈ శుభ‌వార్త మీ కోస‌మే. ఒక ఆర్థిక సంవ‌త్స‌రం మొత్తం వ‌డ్డీ ఆదాయం రూ. 50 వేలుకు మించ‌ని సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు, ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 194ఏ ప్ర‌కారం టీడీఎస్ (మూలం వ‌ద్ద ప‌న్ను) వ‌ర్తించ‌ద‌ని సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) స్ప‌ష్టం చేసింది. ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం1962, రూల్ 31ఏ స‌బ్ రూల్ (5) ప్ర‌కారం, నిర్ధిష్ట విధానాల‌ను, ప్ర‌మాణాల‌ను పాటిస్తూ స్టేట్‌మెంట్‌ల‌ను త‌న‌ఖీ చేసేందుకు, ధృవ‌ప‌రిచేందుకు, ఫార‌మ్ 26బీ కింద రిఫండ్ క్లెయిమ్ చేసుకొనేందుకు, రోజు వారీ ప‌రిపాల‌నా భాద్య‌త‌ల‌ను నిర్వ‌హించేందుకు ఆదాయం-పన్ను డైరెక్టర్ జనరల్‌కు అధికారం ఇచ్చినట్లు పన్ను శాఖ విభాగం పేర్కొంది. ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం1962, రూల్ 31ఏ స‌బ్ రూల్ (5) ప్ర‌కారం, సీబీడీటీ బోర్డు ఇచ్చిన అధికారాల‌తో సెక్ష‌న్ 194ఏ కింద వ‌ర్తించే టీడీఎస్, వార్షిక వ‌డ్డీ ఆదాయం రూ.50 వేల లోపు ఉన్న సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు వ‌ర్తించ‌ద‌ని, ఆదాయ‌పు ప‌న్ను శాఖ ప్ర‌ధాన అధికారి స్ప‌ష్టం చేశారు.

వడ్డీ ఆదాయం రూ .10 వేల లోపు ఉన్న ప‌న్ను చెల్లింపుదారుల‌కు అంద‌రికీ ప‌న్ను మిన‌హాయింపు ఉండేది. అయితే, సీనియర్ సిటిజ‌న్‌ల‌కు గౌరవప్రదమైన జీవితాన్ని అందించడానికి, ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జేట్లీ 2018-19 బడ్జెట్లో కొన్ని ముఖ్యమైన ప్రోత్సాహకాలు అందించారు. అందులో భాగంగా రూ. 50 వేలు వార్షిక వ‌డ్డీ ఆదాయం మించ‌ని ప‌న్ను చెల్లింపుదారుల‌కు సెక్ష‌న్ 194ఏ ప్ర‌కారం వ‌ర్తించే టీడీఎస్ ఇక‌పై వ‌ర్తించ‌దు. ఇందు కోసం ఒక కొత్త సెక్ష‌న్ 80టీటీబీను ప్ర‌వేశ పెట్టారు. ఈ ప్ర‌యోజ‌నం అన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌కు, రిక‌రింగ్ డిపాజిట్ ప‌థ‌కాల‌కూ వ‌ర్తిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని