త‌క్కువ ఇంధ‌న వ్య‌యంతో ట్రాక్ట‌ర్‌

ఈ కొత్త ట్రాక్ట‌ర్ డీజిల్ నుండి సిఎన్‌జిగా మార్చ‌బ‌డింది.

Published : 13 Feb 2021 12:39 IST

ఇండియా యొక్క మొట్ట‌మొద‌టి `సిఎన్‌జీ` ట్రాక్ట‌ర్ ఆవిష్క‌రించ‌బ‌డింది. ఈ ట్రాక్ట‌ర్ ఉప‌యోగించ‌డం ద్వారా ఇంధ‌న వ్య‌యాల‌పై ముఖ్యంగా రైతుల‌కు సంవ‌త్స‌రానికి రూ. ల‌క్షా 50 వేల నుండి 2 ల‌క్షల వ‌ర‌కు ఆదా అవుతుంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం పేర్కొంది.

నిర్వ‌హ‌ణ వ్య‌యాన్ని త‌గ్గించ‌డం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచ‌డానికి మ‌రియు గ్రామీణ భార‌త‌దేశంలో ఉద్యోగ అవ‌కాశాల‌ను క‌ల్పించ‌డంలో ఇది స‌హాయ‌ప‌డుతుంద‌ని కేంద్రం తెలిపింది.

కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీ భార‌త‌దేశ‌పు మొట్ట‌మొద‌టి `సీఎన్‌జీ` ట్రాక్ట‌ర్ని ఆవిష్క‌రించారు. ఈ కొత్త ట్రాక్ట‌ర్ డీజిల్ నుండి సిఎన్‌జిగా మార్చ‌బ‌డింది. ఈ మార్పిడిని `రామాట్ టెక్నో సొల్యూష‌న్స్ అండ్ తోమాసెట్టో అచిల్లె ఇండియా` సంయుక్తంగా చేశాయి. నిర్వ‌హ‌ణ వ్య‌యాన్ని త‌గ్గించ‌డం ద్వారా రైతులు త‌మ ఆదాయాన్ని పెంచ‌డానికి ఇది స‌హాయ‌ప‌డుతుంద‌ని ప్ర‌భుత్వం పేర్కొంది. ట్రాక్ట‌ర్ల‌పై సిఎన్‌జి కిట్‌ల కోసం ప్ర‌భుత్వం రెట్రో ఫిట్‌మెంట్ కేంద్రాల‌ను ఏర్పాటు చేస్తుంది. దేశంలో ప్ర‌తీ జిల్లాలో ఇలాంటి కేంద్రాల‌ను ఏర్పాటు చేయాల‌ని ప్ర‌భుత్వం యోచిస్తొంది.

ప్ర‌భుత్వ లెక్క‌ల ప్ర‌కారం వ్య‌వ‌సాయం కోసం ట్రాక్ట‌ర్ల‌పై ఆధార‌ప‌డే రైతుల‌కు కేవ‌లం ఇంధ‌న వ్య‌యంలో సంవ‌త్స‌రానికి భారీ ల‌బ్ది చేకూర‌నుంది. ట్రాక్ట‌ర్‌ని సిఎన్‌జి ఇంధ‌నంతో న‌డిచేవిధంగా మార్చ‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఆర్థికంగానే కాకుండా ఆరోగ్య‌ప‌ర‌మైన‌వి కూడా. ఈ సిఎన్‌జి ఇంధ‌నంలో  కార్బ‌న్ మ‌రియు ఇత‌ర కాలుష్య కార‌కాలు శాతం చాలా త‌క్కువ‌. స్వ‌చ్ఛ‌మైన ఇంధ‌నంగానే ప‌రిగ‌ణించ‌వ‌చ్చు.

హెచ్చు త‌గ్గుల పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌తో పోలిస్తే సిఎన్‌జి ధ‌ర‌లు చాలా వ‌ర‌కు స్థిరంగానే ఉంటాయి. డీజిల్‌తో న‌డిచే వాహ‌నాల కంటే సిఎన్‌జి వాహ‌నాల స‌గ‌టు మైలేజ్ ఎక్కువ‌, మెయింటైనెన్స్ ఖ‌ర్చులు కూడా త‌క్కువ‌నే చెప్పాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని