‘భారత్‌లో తయారీ’కి జపాన్‌ దన్ను

‘భారత్‌లో తయారీ’ని ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తు్న్న ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల(పీఎల్‌ఐ) పథకానికి జపాన్‌ నుంచి సహకారం అందే అవకాశం ఉందని కేంద్రం భావిస్తోంది. మొత్తం 13 కీలక రంగాలకు ఈ పీఎల్‌ఐ పథకం ప్రకటించాలని

Published : 12 Mar 2021 23:35 IST

దిల్లీ: ‘భారత్‌లో తయారీ’ని ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల(పీఎల్‌ఐ) పథకానికి జపాన్‌ నుంచి సహకారం అందే అవకాశం ఉందని కేంద్రం భావిస్తోంది. మొత్తం 13 కీలక రంగాలకు ఈ పీఎల్‌ఐ పథకం ప్రకటించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. వీటిలో టెలికాం, ఆహార శుద్ధి, వైద్య పరికరాలు, వాహన-వాటి విడిభాగాలు, సోలార్‌ వంటి కీలక రంగాలు ఉన్నాయి. ఈ రంగాల్లో తయారీపై జపాన్‌కు మంచి అనుభవం, నైపుణ్యం ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌ ప్రకటిస్తున్న పీఎల్‌ఐ పథకాల్లో జపాన్‌ అత్యంత ఆసక్తి కనబరిచే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నామని డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌ (డీపీఐఐటీ) కార్యదర్శి గురుప్రసాద్‌ మొహపాత్రా తెలిపారు. ఫిక్కీ నిర్వహించిన ఇండియా-జపాన్‌ బిజినెస్ కోఆపరేషన్‌ కమిటీ 44వ సంయుక్త సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జపాన్‌లోనూ కంపెనీలకు రాయితీలు, ప్రోత్సాహకాలు ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. అలాగే ఇటీవల ఇరు దేశాల మధ్య పారిశ్రామిక భాగస్వామ్యం బలపడుతోందని తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో జపాన్‌ కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపే అవకాశం ఉందన్నారు.

ఇవీ చదవండి...

గూగుల్‌ పే.. గోప్యత మీ ఇష్టమే

గృహరుణం.. వడ్డీ రేట్లు..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు