బ్యాంకుల రుణాలు త‌గ్గాయా? పెరిగాయా?

బ్యాంకుల రుణాలు ఈ ఫిబ్ర‌వ‌రి 26 నాటికి 2 వారాల్లో 6.6% పెరిగి, డిపాజిట్లు 12.1% పెరిగాయి.

Updated : 13 Mar 2021 12:54 IST

దేశీయంగా బ్యాంకుల రుణాలు ఈ ఫిబ్ర‌వ‌రి 26 నాటికి 2 వారాల్లో 6.6% పెరిగాయి.

బ్యాంక్ డిపాజిట్లు రూ. 1.52 ల‌క్ష‌ల కోట్ల‌కు పెరిగి రూ. 149.34 ల‌క్ష‌ల కోట్ల‌కు చేరుకున్నాయి.

ఈ కాలంలో రుణాలు రూ. 71,273 కోట్ల‌కు పెరిగి రూ. 107.75 ల‌క్ష‌ల కోట్ల‌కు చేరుకున్నాయి.

భార‌తీయ బ్యాంకుల రుణాలు ఈ ఫిబ్ర‌వ‌రి 26 నాటికి 2 వారాల్లో 6.6% పెరిగి, డిపాజిట్లు 12.1% పెరిగాయ‌ని ఆర్‌బీఐ తెలిపింది.

ఆహారేత‌ర ప‌రిశ్ర‌మ‌ల‌కు రుణాలు రూ. 71,355 కోట్ల‌కు పెరిగి రూ. 107 ల‌క్ష‌ల కోట్ల‌కు చేరుకోగా,  ఆహార సంబంధిత ప‌రిశ్ర‌మ‌ల‌కు  రుణాలు రూ. 81 కోట్లు త‌గ్గి రూ. 75,206 కోట్ల‌కు చేరుకున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని