మళ్లీ కొలువుల మార్కెట్‌ పుంజుకొంటోంది..!

భారత్‌లో కరోనా వైరస్‌ ప్రళయం తగ్గే కొద్దీ మెల్లగా ఆర్థిక వ్యవస్థ పుంజుకొంటోంది. తాజాగా దేశంలో నిరుద్యోగ రేటు కూడా కొంత తగ్గినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జూన్‌ 13నాటికి లెక్కగట్టిన గణాంకాల

Updated : 15 Jun 2021 15:27 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌లో కరోనా వైరస్‌ ప్రళయం తగ్గే కొద్దీ మెల్లగా ఆర్థిక వ్యవస్థ పుంజుకొంటోంది. తాజాగా దేశంలో నిరుద్యోగ రేటు కూడా కొంత తగ్గినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జూన్‌ 13నాటికి లెక్కగట్టిన గణాంకాల ప్రకారం నిరుద్యోగ రేటు 13.6శాతం నుంచి 8.7శాతానికి తగ్గింది. ఈ గణాంకాలను ‘సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ ప్రైవేటు లిమిటెడ్‌’ సంస్థ లెక్కగట్టింది. పట్టణాల్లో నిరుద్యోగ రేటు 14.4శాతం నుంచి 9.7శాతానికి పడిపోయింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఇది 13.3 నుంచి 8.2కు చేరింది. 

దేశంలోని వివిధ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌లు తొలగిస్తుండటంతో మెల్లగా రవాణా రంగం కూడా మెరుగుపడుతోంది. గూగుల్‌ ‘కమ్యూనికేషన్‌ మొబిలిటీ ’ నివేదికలో ప్రజారవాణా,ఆఫీసుల్లో మళ్లీ కార్యకలాపాలు పుంజుకొన్నట్లు పేర్కొంటోంది. విద్యుత్తు వినియోగం కూడా ఇటీవల కాలంలో బాగా పుంజుకొన్నట్లు  గత కొన్ని వారాలుగా గణాంకాలు చెబుతున్నాయి. 

‘‘జులై చివరి నాటికి లాక్‌డౌన్‌ నిబంధనలు గణనీయంగా సడలించే అవకాశం ఉంది. దీంతో మార్చి ముందు నాటి పరిస్థితులు మళ్లీ నెలకొనవచ్చు. ఈ ఆర్థిక సంవత్సరంలో భారత్‌ కోలుకోవడాన్ని వేగవంతం చేస్తుంది’’ అని బ్లూమ్‌బెర్గ్‌కు చెందిన ఆర్థిక వేత్త అభిషేక్‌ గుప్తా పేర్కొన్నారు.    

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని