Infy Q2 Results: ఇన్ఫోసిస్‌లో ఈ ఏడాది 45 వేల నియామకాలు!

ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్‌.. జులై-సెప్టెంబరు త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.5,421 కోట్లకు చేరుకుంది. 2020-21 ఇదే త్రైమాసకంలో కంపెనీ లాభం రూ.4,845 కోట్లతో పోలిస్తే, ఈసారి 11.9 శాతం వృద్ధి లభించింది....

Published : 13 Oct 2021 22:41 IST

సెప్టెంబరు త్రైమాసిక లాభంలో 12% వృద్ధి

దిల్లీ : ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్‌.. జులై-సెప్టెంబరు త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.5,421 కోట్లకు చేరుకుంది. 2020-21 ఇదే త్రైమాసకంలో కంపెనీ లాభం రూ.4,845 కోట్లతో పోలిస్తే, ఈసారి 11.9 శాతం వృద్ధి లభించింది. ఇదే సమయంలో ఆదాయాలు సైతం రూ.24,570 కోట్ల నుంచి 20.5 శాతం పెరిగి రూ.29,602 కోట్లకు చేరుకున్నాయి. ఒక్కో షేరుకు రూ.15 మధ్యంతర డివిడెండ్‌ ఇవ్వాలని బోర్డు నిర్ణయించింది. అన్ని ఐటీ కంపెనీల తరహాలోనే ఇన్ఫోసిస్‌లోనూ ఉద్యోగుల వలసల రేటు 20.1 శాతానికి ఎగబాకింది.

* సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో కంపెనీలో ఉద్యోగుల సంఖ్య 2,79,617కి చేరింది. భారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టనుంది. ఈ ఏడాది 35,000 మందికి కొత్తగా ఉద్యోగాలిస్తామని గతంలో ప్రకటించగా, గిరాకీకి అనుగుణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంతర్జాతీయంగా 45,000 మందిని ప్రాంగణ ఎంపికల ద్వారా నియమించబోతున్నట్లు బుధవారం ఆర్థిక ఫలితాల సందర్భంగా తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని