లిక్విడ్ ఫండ్లు -బ్యాంక్ డిపాజిట్లలో ఏది మేలు?

లిక్విడ్ ఫండ్లు స్వ‌ల్ప కాల పెట్టుబ‌డులుకు మంచి ఆప్ష‌న్ అనేది ఆర్థిక నిపుణుల సూచ‌న‌....

Published : 18 Dec 2020 17:17 IST

లిక్విడ్ ఫండ్లు స్వ‌ల్ప కాల పెట్టుబ‌డులుకు మంచి ఆప్ష‌న్ అనేది ఆర్థిక నిపుణుల సూచ‌న‌.​​​​​​​

డ‌బ్బు స్థిరంగా ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌లో ఉంచితే ఎటువంటి ప్ర‌యోజ‌నం ఉండ‌దు. అదే లిక్విడ్ ఫండ్ల‌లో పొదుపు చేస్తే త‌క్కువ కాల‌ప‌రిమితితో అధిక లాభాల‌ను పొంద‌వ‌చ్చు. గ‌త చ‌రిత్ర‌ను చూసుకుంటే లిక్విడ్ ఫండ్లు మంచి లాభాల‌నే తెచ్చిపెట్టాయి. ఇందులో పెట్టుబ‌డులు డెట్, మార్కెట్ల‌లోకి చేర‌తాయి.

మీ ఫండ్ మేనేజ‌ర్ మంచి క్రెడిట్ రేటింగ్‌, త‌క్కువ రిస్క్ ఉన్న‌వాటిని లిక్విడ్ ఫండ్‌ను ఎంచుకుంటే స్వ‌ల్ప‌కాలంలో ఆశించిన లాభాన్ని పొంద‌వ‌చ్చు. ఉపసంహ‌ర‌ణ కూడా చాలా సుల‌భంగా ఉంటుంది. కానీ చాలామంది వినియోగ‌దారులు బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌లో దాచుకునేందుకే ఇష్ట‌ప‌డ‌తారు. లిక్విడ్ పండ్ల‌తో పోలిస్తే ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌లో లిక్విడిటీ అధికంగా ఉంటుంది. కానీ, ప‌న్ను రిట‌ర్నుల త‌ర్వాత చూసుకుంటే లిక్విడ్ ఫండ్ల‌లో రాబ‌డి ఎక్కువ‌గా ఉంటుంది.

మీకు ఒకేసారి బోన‌స్ లేదా ఏదైనా స్థిరాస్తి వంటివి విక్ర‌యించిన‌ప్పుడు ఒకేసారి డ‌బ్బు వ‌స్తుంది. అప్పుడు డ‌బ్బును ఎందులో పెట్టాలో నిర్ణ‌యించుకోలేని ప‌రిస్థితుల్లో ఉన్న‌ప్పుడు లిక్విడ్ ఫండ్లు ఎంచుకోవ‌డం మంచిద‌నేది నిపుణుల‌ అభిప్రాయం. లిక్విడ్ ఫండ్ల‌లో ప్ర‌వేశ‌, నిష్క్ర‌మ‌ణ రుసుములు ఉండ‌వు. ఒక‌రోజు డ‌బ్బును ఈ ఫండ్ల‌లో ఉంచినా వ‌డ్డీ ల‌భిస్తుంది. అదే బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌లో అయితే క‌నీసం మూడు నెల‌ల స‌మ‌యం ప‌డుతుంది. లిక్విడ్ ఫండ్ల‌లో ముందుగా విత్‌డ్రా చేసుకుంటే 1 శాతం పెనాల్టీ ప‌డుతుంది. పెట్టుబ‌డుల గురించి తెలియ‌నివారికి కూడా ఇది సుల‌భంగా ఉంటుంది.

బ్యాంకులు వారం కంటే త‌క్కువ స‌మ‌యం డ‌బ్బు ఉంచితే ఎలాంటి వ‌డ్డీ చెల్లించ‌దు. అందుకే స్వ‌ల్ప కాలానికి ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉండేలా లిక్విడ్ ఫండ్ల‌ను ఎంచుకోవాలి. డ‌బ్బు ఎప్ప‌టివ‌ర‌కు పెట్టాలో, ఎప్పుడు ఉప‌సంహ‌రించుకోవాల‌న్న విష‌యంపై స్ప‌ష్ట‌త లేన‌ప్పుడు లిక్విడ్ ఫండ్లు మేలు చేస్తాయి. అయితే ఏ మాత్రం రిస్క్ తీసుకునేందుకు ఇష్ట‌ప‌డ‌నివారు ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌నే ఎంచుకోవాలి.

ఈ రెండూ పెట్టుబ‌డి సాధ‌నాలు 7 శాత‌వ వ‌ర‌కు వ‌డ్డీ అందిస్తాయి. అయితే ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌లో వ‌డ్డీ రేట్లు క‌చ్చితంగా ఉంటాయి. లిక్విడ్ ఫండ్ల‌లో ఇవి వేరుగా ఉంటాయి. గ‌త కొన్ని త్రైమాసికాలుగా ఇవి 7.2 శాతం వ‌ర‌కు రాబ‌డినందిస్తున్నాయి. గ‌తేడాది లిక్విడ్ ఫండ్ల రాబ‌డులు 6.6 శాతం కాగా, ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌లో 7 శాతం వ‌చ్చాయి. సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు కొన్ని బ్యాంకులు ఎక్కువ వ‌డ్డీ రేట్ల‌ను ఆఫ‌ర్ చేస్తాయి. డిపాజిట్‌దారుడి వ‌య‌సు, పెట్టుబ‌డులు గ‌డువు, బ‌ట్టి రాబ‌డి ఉంటుంది. పెట్టుబ‌డుదారుడి సౌక‌ర్యాన్ని బ‌ట్టి ఇవి ఎంచుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని