ప‌న్ను ర‌హిత బాండ్ల‌లో పెట్టుబ‌డుల‌కు ముందు రాబ‌డి లెక్కించండి

పెట్టుబడిదారుడు పన్ను రహిత బాండ్లపై అధిక రాబడిని పొందడమే గాక‌, లాభాలపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు...

Published : 23 Dec 2020 11:43 IST

పెట్టుబడిదారుడు పన్ను రహిత బాండ్లపై అధిక రాబడిని పొందడమే గాక‌, లాభాలపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు

ఆర్‌బీఐ మార్చి 27 న జ‌రిపిన స‌మీక్ష త‌ర్వాత సాంప్ర‌దాయంగా వ‌స్తున్న పెట్టుబడుల‌పై వ‌డ్డీ రేట్లు త‌గ్గుతూ వ‌స్తున్నాయి. దీంతోఇప్పుడు స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌ల‌లో ప‌న్ను-ర‌హిత బాండ్లు మంచి ఆప్ష‌న్‌గా క‌నిపిస్తున్నాయి.

ఎస్‌బీఐ ఏడాది నుంచి ప‌దేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై 5.7 శాతం వ‌డ్డీ అందిస్తుంది. పోస్టాఫీస్ సేవింగ్స్ ప‌థ‌కంపై మూడేళ్ల‌కు 5.5 శాతం, ఐదేళ్ల 6.7 శాతం వ‌డ్డీ రేటు ఇస్తోంది.

ప‌న్ను ర‌హిత బాండ్ల‌లో పెట్టుబ‌డుల‌తో రాబ‌డిపై ఎలాంటి ప‌న్ను ఉండ‌దు. దీంతో పాటు అధిక రాబ‌డి పొంద‌వ‌చ్చు. వీటికి సార్వ‌భౌమ హామీతో పాటు 20 శాతం కంటే ఎక్కువ ప‌న్ను ప‌రిధిలోకి వ‌చ్చేవారికి ఉప‌యోగ‌క‌రంగా ఉంటాయి.

పన్ను రహిత బాండ్లు సాధారణంగా ప్రభుత్వ యాజమాన్యంలోని కంపెనీలు చాలా సంవత్సరాల క్రితం జారీ చేసిన దీర్ఘకాలిక పత్రాలు, అయితే స‌బ్‌స్క్రైబ్ చేసుకున్న‌వారు ఎక్స్‌ఛేంజ్‌లో ఈ బాండ్ల‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు.

నేష‌న‌ల్ హైవేస్‌ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్ఏఐ), హౌసింగ్ అండ్ అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ లిమిటెడ్ (హ‌డ్కో), ఇండియ‌న్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేష‌న్ లిమిటెడ్ (ఐఆర్ఎఫ్‌సీ), ప‌వ‌ర్ ఫైనాన్స్ కార్పొరేష‌న్ లిమిటెడ్ (పీఎఫ్‌సీ), ఎన్‌టీపీసీ, ఆర్ఈసీ, నాబార్డ్‌, ఐఐఎఫ్‌సీఎల్ వంటి కంపెనీలు ఈ ట్యాక్స్‌-ఫ్రీ బాండ్ల‌ను జారీచేశాయి. బాండ్ల‌ కూప‌న్ రేట్లు 7.5 శాతం నుంచి 9.0 శాతం వ‌ర‌కు ఉన్నాయి.

అయితే కేవ‌లం కూప‌న్ రేట్ల‌ను చూసి బాండ్ల‌ను కొనుగోలు చేయ‌వ‌ద్దు. మోచ్యూరిటీ, రాబ‌డి వంటి అంశాల‌ను ప‌రిగ‌ణలోకి తీసుకోవాలి. రాబ‌డితో పాటు లాభ‌, న‌ష్టాల‌ను అంచ‌నా వేయాలి. పెట్టుబ‌డుల సామ‌ర్థ్యాన్ని బ‌ట్టి నిర్ణ‌యం తీసుకోవ‌చ్చు.

ఉదాహ‌ర‌ణ‌కు 15 ఏళ్ల కాల‌ప‌రిమితితో కూడిన‌ ఐఆర్ఎఫ్‌సీ బాండ్ తీసుకుంటే దీనిని డిసెంబ‌ర్ 21, 2015 లో జారీచేశారు. ముఖ విలువ రూ.1000, కూప‌న్ ధ‌ర 7.53 శాతం. ఎన్ఎస్ఈలో గ‌త ట్రేడింగ్ ధ‌ర రూ.1,195 వ‌ద్ద ఉంది. మెచ్యూరిటీపై రాబ‌డి 5.37 శాతం. 30 శాతం ప‌న్ను ప‌రిదిలోకి వ‌చ్చేవారికి ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో వ‌చ్చే 7.7 శాతం కంటే ఇది మంచి లాభాన్నిస్తుంది. గ‌త ట్రేడింగ్ ధ‌ర ఆధారంగా రాబ‌డి లెక్కించ‌వ‌చ్చు లేదా ఆన్‌లైన్ కాలిక్యులేట‌ర్‌ను ఉప‌యోగించి లెక్కించ‌వ‌చ్చు.

ఈ బాండ్లు చాలా ప్రజాదరణ పొందినందున, చాలా మంది మధ్యవర్తులు, బ్రోకర్లు కూడా వీటిని నిర్వ‌హిస్తారు. కమీషన్ బ్రోకర్‌తో పాటు మారుతూ ఉన్నప్పటికీ, సాధారణంగా, వారు 10-15 బేసిస్ పాయింట్లు (బిపిఎస్) వసూలు చేస్తారు. బ్రోక‌ర్లు చూసే లావాదేవీల‌ కనీస పెట్టుబడి ల‌క్ష రూపాయ‌ల నుంచి క‌నీసం రూ.2 ల‌క్ష‌లు ఉండాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని