ఐపీఓకు సిద్ధ‌మ‌వుతున్న మార్కోలిన్ ట్రాఫిక్ కంట్రోల్స్

ప్ర‌తి ఈక్విటీ షేరు ధ‌ర రూ. 78గా నిర్ణ‌యించ‌బ‌డింది.

Published : 14 Sep 2021 13:36 IST

ఈ వారం మార్కోలిన్ ట్రాఫిక్ కంట్రోల్స్ స‌బ్స్‌క్క్రిప్ష‌న్ (చందా) కోసం ఐపీఓ ప్రారంభ‌మ‌వుతుంది. మార్కోలిన్ ట్రాఫిక్ కంట్రోల్స్ ఐపీఓ సెప్టెంబ‌ర్ 15న ప్రారంభ‌మ‌వుతుంద‌ని భావిస్తున్నారు. 

మార్కోలిన్ ట్రాఫిక్ కంట్రోల్స్ త‌న వ్యాపార కార్య‌క‌లాపాల‌ను 2002లో ప్రారంభించింది. మొద‌ట్లో రోడ్ మార్కింగ్‌తో ప్రారంభ‌మైంది, త‌ర్వాత 2009లో హైవే ప్రాజెక్టుల నిర్వ‌హ‌ణ వ్యాపారాల‌ను ప్రారంభించింది. కంపెనీ త‌న ప్రారంభ ప‌బ్లిక్ ఆఫ‌ర్ (ఐపీఓ)ను సెప్టెంబ‌ర్ 15న ప్రారంభిస్తుంది.  ఇది ప్ర‌ముఖ హైవే ఆప‌రేష‌న్‌, మెయింటెనెన్స్ స‌ర్వీసింగ్ అందించే కంపెనీ. బీఎస్ఈకి దాఖ‌లు చేసిన ప్రాస్పెక్ట‌స్ ప్ర‌కారం 51,28,000 ఈక్విటీ షేర్లు, ప్ర‌తి ఈక్విటీ షేరు ధ‌ర రూ. 78గా నిర్ణ‌యించ‌బ‌డింది. మొత్తం షేర్ల‌లో 24,35,200 ఈక్విటీ షేర్లు రిటైల్ వ్య‌క్తిగ‌త పెట్టుబ‌డిదారులు, సంస్థేత‌ర పెట్టుబ‌డిదారుల‌కు రిజ‌ర్వ్ చేయ‌బ‌డ్డాయి. గ్రెటెక్స్ కార్పోరేట్ స‌ర్వీసెస్ లిమిటెడ్ ఇష్యూ లీడ్ మేనేజ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తుంది. కంపెనీ మూల‌ధ‌న అవ‌స‌రాల్ని బ‌లోపేతం చేయ‌డానికి ఇష్యూ యొక్క నిక‌ర ఆదాయంలో ఎక్కువ భాగం ఉప‌యోగించాల‌ని కంపెనీ యోచిస్తోంది. అంతేగాక ఈ ఇష్యూతో వ‌చ్చే ఆదాయం వ‌ర్కింగ్ క్యాపిట‌ల్ అవ‌స‌రాల కోసం ఉప‌యోగించాల‌ని కంపెనీ ఆలోచ‌న‌. ఈ మార్కోలిన్ ట్రాఫిక్ కంట్రోల్స్.. టోల్ ఆప‌రేష‌న్స్‌, రూట్ పెట్రోలింగ్‌, ఇన్సిడెంట్ మేనేజ్‌మెంట్‌, హైవే మెయింటెనెన్స్ వంటి స‌ర్వీసుల‌ను క‌లిగి ఉంది. 

భార‌త‌దేశం ప్ర‌పంచంలో 2వ అతిపెద్ద ర‌హ‌దారి నెట్‌వ‌ర్క్ క‌లిగి ఉంది. ఇది మొత్తం 6.21 మిలియ‌న్ కిలోమీట‌ర్లు విస్త‌రించి ఉంది. ప్ర‌తి ఏడాది ఈ రోడ్లు పెరుగుతూనే ఉన్నాయి. భారీ మార్కెట్ సామ‌ర్ధ్యంతో, ప‌నితీరు ఆధారంగా మార్కెట్‌లో ఉండ‌టం వ‌ల్ల‌, రాబోయే సంవ‌త్స‌రాల్లో స్థిర‌మైన వృద్ధికి `మార్కోలిన్‌` ఖ‌చ్చితంగా ప్ర‌యోజ‌నం పొందుతుంద‌ని కంపెనీ భావిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని