cryptocurrency: క్రిప్టో రంగాన్ని ప్రోత్సహించే ఉద్దేశం లేదు: కేంద్రం

క్రిప్టో కరెన్సీ రంగాన్ని ప్రోత్సహించే ఉద్దేశమేదీ లేదని కేంద్రం స్పష్టంచేసింది. పార్లమెంట్‌లో క్రిప్టో కరెన్సీ నియంత్రణ బిల్లును ప్రవేశ పెట్టనున్న వేళ ఈ వ్యాఖ్యలు చేసింది.

Published : 06 Dec 2021 20:49 IST

దిల్లీ: క్రిప్టో కరెన్సీ రంగాన్ని ప్రోత్సహించే ఉద్దేశమేదీ లేదని కేంద్రం స్పష్టంచేసింది. పార్లమెంట్‌లో క్రిప్టో కరెన్సీ నియంత్రణ బిల్లును ప్రవేశ పెట్టనున్న వేళ ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు పార్లమెంట్‌లో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌధరి లిఖిత పూర్వక సమాధానమిచ్చారు.

నమ్మదగిన క్రిప్టో కరెన్సీని ఎలా గుర్తిస్తారు? క్రిప్టో మార్కెట్‌ను ఎలా నియంత్రిస్తారనే మరో ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. ప్రస్తుతం క్రిప్టో కరెన్సీలపై దేశంలో నియంత్రణేదీ లేదని పేర్కొన్నారు. క్రిప్టో కరెన్సీ రంగానికి సంబంధించిన డేటా ఏదీ లేదని ప్రభుత్వం సేకరించడం లేదని చెప్పారు. ప్రస్తుత శీతాకాల సమావేశాల్లోనే ఈ బిల్లును తీసుకురానున్నట్లు వెల్లడించారు. కేంద్రం తీసుకురాబోయే డిజిటల్‌ కరెన్సీ గురించి కూడా మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు. నగదుపై ఆధారపడడం తగ్గించడానికి ఈ డిజిటల్‌ కరెన్సీ ఉపయోగపడుతుందన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ మొత్తంలో లావాదేవీలు చేయడానికి వీలు పడడమే కాకుండా.. సెటిల్‌మెంట్‌ రిస్క్‌ కూడా దీనివల్ల తగ్గుతుందని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని