ఎన్‌పీఎస్ పాక్షిక ఉపసంహరణ నిబంధ‌న‌ల స‌వ‌రింపు

ఎన్‌పీఎస్ చందాదారులు ఇక నుంచి మూడేళ్ల‌కే న‌గ‌దును విత్‌డ్రా చేసుకోవ‌చ్చు​​​​​​...

Published : 21 Dec 2020 13:14 IST

ఎన్‌పీఎస్ చందాదారులు ఇక నుంచి మూడేళ్ల‌కే న‌గ‌దును విత్‌డ్రా చేసుకోవ‌చ్చు​​​​​​​

12 మార్చి 2018 మధ్యాహ్నం 12:17

జాతీయ పింఛ‌ను ప‌థ‌కం చందాదారుల‌కు గొప్ప ఊర‌ట క‌లిగించే నిర్ణ‌యాన్ని పింఛ‌ను నిధి నియంత్ర‌ణ అభివృద్ధి సంస్థ(పీఎఫ్ఆర్‌డీఏ) తీసుకుంది. ప్ర‌స్తుతం పింఛ‌ను నిధి నుంచి ప‌దేళ్ల త‌ర్వాత మాత్ర‌మే పాక్షికంగా న‌గ‌దు ఉప‌సంహ‌ర‌ణ‌కు అనుమ‌తిస్తుండ‌గా, తాజాగా దీనిని పీఎఫ్ఆర్‌డీఏ మూడేళ్ల‌కు(ఖాతాదారుడు ఎన్‌పీఎస్ లో చేరిన రోజు నుండి) కుదించింది. ఖాతాలో ఉన్న మొత్తం సొమ్ము(కేవలం మీ కాంట్రిబ్యూషన్స్ లో) లో 25 శాతం మించ‌కుండా వెన‌క్కి తీసుకోవాల్సి ఉంటుంది.

ఇంత‌కుముందు ఎన్‌పీఎస్ చందాదారుడు ప‌దేళ్ల త‌ర్వాత మాత్ర‌మే 25 శాతం విత్‌డ్రా చేసుకునే అవ‌కాశం ఉండేది. అది కూడా మొత్తం కాల‌ప‌రిమితిలో మూడు సార్లు మాత్ర‌మే నిధుల ఉప‌సంహ‌ర‌ణ‌కు వీలుండేది. అయితే ఈ నిబంధ‌న‌లు ఇప్ప‌డు స‌వ‌రించ‌డం జ‌రిగింది. ఎన్‌పీఎస్ లో పాక్షిక ఉపసంహరణ పూర్తిగా పన్ను రహితము.

ఎన్‌పీఎస్ లో పాక్షిక ఉపసంహరణ వీటి కోసం చేయవచ్చు:

  1. పిల్లల చదువు
  2. పిల్లల పెళ్లిళ్లు
  3. ఇల్లు కొనుగోలు
  4. కొన్ని అనారోగ్యాలు

జాతీయ పింఛ‌ను ప‌థ‌కం (ఎన్‌పీఎస్‌) జ‌న‌వ‌రి 1, 2004 న ప్రారంభ‌మైంది. ఉద్యోగుల‌కు రిటైర్మెంట్ త‌ర్వాత చేయూత‌ను అందించేందుకు ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది. అదేవిధంగా పొదుపును అల‌వాటు చేసేందుకు, విశ్రాంత జీవితం ఆనందంగా గ‌డిపేందుకు ఈ ప‌థ‌కాన్ని ప్రారంభించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని