ఐపీఓకు సిద్ధ‌మ‌వుతున్న ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ‌

న‌వోద‌య్ ఎంట‌ర్‌ప్రైజెస్ సంస్థ ఈవెంట్స్ నిర్వ‌హ‌ణ‌లో నిమ‌గ్న‌మై ఉంది.

Published : 08 Jun 2021 13:12 IST

ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ `న‌వోద‌య్ ఎంట‌ర్‌ప్రైజెస్`  `ఐపీఓ` జూన్ 14న ప్రారంభ‌మ‌వుతుంది.

న‌వోద‌య్ ఎంట‌ర్‌ప్రైజెస్ లిమిటెడ్ ఐపీఓ ల‌క్ష్యం దాదాపు రూ. 46.08 కోట్లు. జూన్ 17న ఇష్యూ ముగుస్తుంది. 
మార్కెటింగ్ మ‌రియు ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ న‌వోద‌య్ ఎంట‌ర్‌ప్రైజెస్ లిమిటెడ్ త‌న ప్రారంభ ప‌బ్లిక్ ఆఫ‌ర్‌ను జూన్ 14న ప్రారంభించ‌డానికి ధ‌ర ఒకో షేరుకి రూ. 20 చొప్పున నిర్ణ‌యించింది. న‌వోద‌య్ ఎంట‌ర్‌ప్రైజెస్ 12 ల‌క్ష‌ల షేర్ల‌ను మార్కెట్ వ‌ర్గాల‌కు కేటాయించ‌నుంద‌ని, మిగిలిన రూ. 43.68 కోట్ల‌ను నెట్ ఇష్యూగా ప‌రిగ‌ణిస్తామ‌ని కంపెనీ వ‌ర్గాలు తెలిపాయి.

ఇన్వెంచ‌ర్ మ‌ర్చంట్ బ్యాంక‌ర్ మ‌రియు సాట్లైట్ కార్పొరేట్ స‌ర్వీస్ ఈ ఇష్యూకు లీడ్ మేనేజ‌ర్ల‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. ఈ ఇష్యూ ద్వారా వ‌చ్చే ఆదాయం కంపెనీ వ‌ర్కింగ్ క్యాపిట‌ల్ అవ‌స‌రాలు మ‌రియు సాధార‌ణ కార్పొరేట్ ప్ర‌యోజ‌నాల కోసం ఉప‌యోగించ‌బ‌డతాయ‌ని కంపెనీ ప్ర‌తినిధి తెలిపారు. సంస్థ త‌న వ్యాపార వ్యూహం మ‌రియు ఆదాయ నిర్వ‌హ‌ణ‌కు మార్కెటింగ్ మ‌రియు ప్ర‌క‌ట‌న‌ల‌ను ప్రాథ‌మికంగా ప‌రిగ‌ణిస్తుంది. ఇది బ‌హిరంగ, ముద్ర‌ణ, గ్రౌండ్ ఈవెంట్స్ /  యాక్టివేష‌న్స్ మ‌రియు డిజిట‌ల్ మార్కెటింగ్ విభాగాల‌ను అందిస్తుంది.

న‌వోద‌య్ ఎంట‌ర్‌ప్రైజెస్ సంస్థ ఈవెంట్స్ నిర్వ‌హ‌ణ‌లో నిమ‌గ్న‌మై ఉంది. ఇందులో ఈవెంట్స్ ప్ర‌ణాళిక‌, నిర్వ‌హ‌ణ ఉంటుంది. ఇది త‌న ఖాతాదారుల కోసం వాణిజ్య కార్య‌క్ర‌మాలు, కార్పొరేట్ ఈవెంట్‌లు, సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు, చిన్న బ్రాండ్ ప్ర‌మోష‌న్ ఈవెంట్‌ల‌ను నిర్వ‌హిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని