మూడేళ్ల త‌ర్వాత క్లెయిమ్‌ తిరస్క‌రించలేరు

పాల‌సీకి సంబంధించిన అన్ని ప‌త్రాలు, వివ‌రాలు స‌రిగ్గా ఉన్న‌ప్పుడు క్లెయిమ్ తిర‌స్క‌రించేందుకు వీలుండ‌దు

Published : 22 Dec 2020 20:13 IST

జీవిత బీమా పాల‌సీ కొనుగోలు చేసిన‌ప్పుడు, ముఖ్యంగా ట‌ర్మ్ బీమా పాల‌సీలో హామీ మొత్తం ఎక్కువ‌గా ఉంటుంది. దీంతో త‌ర్వాత కంపెనీలు నామినీకి ఆ మొత్తం చెల్లిస్తాయా లేదా అన్న సందేహం పాల‌సీ తీసుకునేముందు వ‌స్తుంది. ఎందుకంటే కొన్ని కేసుల్లో వివిధ కార‌ణాల‌తో క్లెయిమ్ తిర‌స్క‌ర‌ణ‌ల‌కు గురైన సంఘ‌ట‌న‌లు చాలా క‌నిపిస్తాయి. బీమా నియంత్ర‌ణ సంస్థ (ఐఆర్‌డీఏఐ) వివ‌రాల ప్ర‌కారం 2016-17 సంవ‌త్స‌రంలో జీవిత బీమా సంస్థ‌లు మొత్తం 8.60 ల‌క్ష‌ల క్లెయిమ్‌ల‌ను ప‌రిష్క‌రించిన‌ట్లు తెలిపింది. అదేవిధంగా 12,769 క్లెయిమ్‌ల‌న తిర‌స్క‌రించారు.

కానీ పాల‌సీ కొనుగోలు చేసిన‌ప్పుడు అన్ని డాక్యుమెంట్లు, వివ‌రాలు స‌రైన‌వి ఉంటే క్లెయిమ్ తిర‌స్క‌రిస్తారేమోన‌న్న ఆందోళ‌న అవ‌స‌రం లేదు. బీమా చ‌ట్టం ప్ర‌కారం పాల‌సీ తీసుకున్న‌ మూడేళ్ల త‌ర్వాత సంస్థ‌లు క్లెయిమ్‌ల‌ను తిర‌స్క‌రించ‌లేవు.

బీమా చ‌ట్టం
ఇంత‌కుముందు జీవిత బీమా సంస్థ‌లు పాల‌సీ ఇచ్చిన రెండేళ్ల త‌ర్వాత ఏదైనా మోసపూరిత చ‌ర్య‌లు జ‌రిగితే త‌ప్ప‌ క్లెయిమ్ తిరస్క‌రించేందుకు వీల్లేని విధంగా నిబంధ‌న‌లు ఉండేవి. ఆదాయ ప‌న్ను చ‌ట్టం, సెక్ష‌న్ 45 స‌వ‌ర‌ణ‌ల ప్ర‌కారం బీమా సంస్థ ఇప్పుడు మూడేళ్ల త‌ర్వాత దావాను తిరిస్క‌రించే వీల్లేదు. ఒక‌వేళ పాల‌సీ పున‌రుద్ధ‌రిస్తే, ఆ తేదీ నుంచే లెక్కిస్తారు.

వివ‌ర‌ణ‌:
బీమా సంస్థ మొదటి మూడు సంవత్సరాలలో పాలసీకి సంబంధించి ఎటువంటి ప్ర‌శ్న‌లు వేసేందుకు వీలులేకుండా, బీమా పాలసీని జారీ చేసే ముందు బీమా సంస్థ అడిగే అన్నివివ‌రాల‌ను, పత్రాలను క‌చ్చితంగా తెలియ‌చేయాలి. వయసు, ఆరోగ్య పరిస్థితి, ఆదాయం, కుటుంబ చరిత్ర ఇతర వివరాలను ప్రతిపాదన రూపంలో,ఇత‌ర బీమా పాల‌సీ వివరాలను తెలియ‌చేయాలి. నామినీ పేరును కూడా ఇవ్వాలి.

అన్నింటికంటే ముఖ్యంగా, బీమా దరఖాస్తును మీరు స్వ‌యంగా నింపండి. ఒక వేళ బీమా ఏజెంట్ లేదా బ్యాంకర్ మీ ద‌ర‌ఖాస్తును నింపితే, ఫారమ్‌ను రెండుసార్లు క్షుణ్నంగా చ‌దవండి. మీరు పాల‌సీ డాక్యుమెంటును పొందాక‌ దాంట్లో పేర్కొన్న సమాచారాన్ని, ఫారంలో పూర్తి చేసిన వివరాలను సరిపోల్చి చూసుకోవాలి. ఏవైనా తప్పులు ఉంటే స‌ద‌రు బీమా ఏజెంటు లేదా కార్యాల‌న‌యానికి వెళ్లి వాటిని ప్రారంభంలోనే సరిదిద్దుకోవాలి.

సిరి లో ఇంకా:

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని