ట్రయంఫ్‌ నుంచి రూ.6.95 లక్షల బైక్!

బ్రిటన్‌కు చెందిన ప్రీమియం ద్విచక్రవాహన తయారీ సంస్థ ట్రయంఫ్‌ సరికొత్త ట్రైడెంట్‌ 660 బైక్‌కు భారత్‌లో విడుదల చేసింది. దీని ధరను రూ.6.95 లక్షలుగా(ఎక్స్‌షోరూం) నిర్ణయించారు. ఈ సంస్థ నుంచి వస్తున్న.........

Published : 06 Apr 2021 21:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బ్రిటన్‌కు చెందిన ప్రీమియం ద్విచక్రవాహన తయారీ సంస్థ ట్రయంఫ్‌ సరికొత్త ట్రైడెంట్‌ 660 బైక్‌ను భారత్‌లో విడుదల చేసింది. దీని ధరను రూ.6.95 లక్షలుగా(ఎక్స్‌షోరూం) నిర్ణయించారు. ఈ సంస్థ నుంచి వస్తున్న బైక్‌లలో ట్రైడెంట్‌ 660దే అతితక్కువ ధర. ఇప్పటికే ప్రారంభమైన ఈ బైక్‌ బుకింగ్‌లు కొన్ని వారాల పాటు కొనసాగుతాయని సంస్థ తెలిపింది. బుకింగ్‌లు ముగిసిన కొన్ని రోజుల్లోనే బైక్‌లను వినియోగదారులకు అందిస్తామని తెలిపింది. వినియోగదారులు తమ అభిరుచులకు అనుగుణంగా ఈ బైక్‌ను తీర్చిదిద్దించుకునే అవకాశం కల్పిస్తున్నారు. అందుకోసం 45 ప్రత్యేక ట్రయంఫ్‌ పరికరాలు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ సంస్థ నుంచి రోడ్‌స్టర్‌ సెగ్మెంట్లో వస్తున్న నాలుగో బైక్‌ ఇది.

660 సీసీ సామర్థ్యంతో వచ్చే ఇన్‌లైన్‌ 3 సిలిండర్‌ లిక్విడ్‌ కూల్‌ ఇజిన్‌ 10,250 ఆర్‌పీఎం వద్ద 80 బీహెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది. 6,250 ఆర్‌పీఎం వద్ద 64 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక సస్పెన్షన్‌ విషయానికి వస్తే 41 ఎం.ఎం. షోవా అప్‌సైడ్‌ డౌన్‌ ఫోర్క్స్‌, అడ్జస్టబుల్‌ మోనోషాక్‌ను పొందుపరిచారు. దీంట్లో రెయిన్‌, రోడ్‌ అనే రెండు రైడింగ్‌ మోడ్‌లు ఉన్నాయి. స్పీడ్‌, టాకోమీటర్‌, గేర్‌ పొజిషన్‌ ఇండికేటర్‌, ఫ్యుయల్‌ గేజ్ వంటి వాటి కోసం ముందు భాగంలో టీఎఫ్‌టీ ఇన్‌స్ట్రుమెంట్‌ ప్యానెల్‌ ఇచ్చారు. బ్లూటూత్‌ సపోర్ట్‌ కూడా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని