
పార్లమెంట్‌కు చేరుకున్న నిర్మలమ్మ
దిల్లీ: కేంద్రబడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బృందం పార్లమెంట్‌కు బయల్దేరింది. అంతకుముందు ఈ బృందం ఆర్థికశాఖ కార్యాలయం నుంచి నేరుగా రాష్ట్రపతిభవన్‌కు చేరుకుంది. ప్రొటోకాల్ ప్రకారం దేశ ప్రథమపౌరుడు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసి బడ్జెట్ గురించి వివరించారు. అక్కడి నుంచి పార్లమెంట్‌కు చేరుకున్నారు. ఉదయం 11 గంటలకు లోక్‌సభలో నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
కరోనా దృష్ట్యా ఈ సారి బడ్జెట్ ప్రసంగం కాగితరహితంగా ఉండనుంది. ఇందుకోసం నిర్మలమ్మ సంప్రదాయ బాహీ ఖాటాను వదిలి స్వదేశీ ట్యాబ్‌తో పార్లమెంట్‌కు బయల్దేరారు. సభ్యులకు బడ్జెట్ సాఫ్ట్‌కాపీలు ఇవ్వనున్నారు.
ఇవీ చదవండి..
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.