Paytm:  పేటీఎం ఐపీవో.. ఒక్కో షేరు రూ.2,150కు కేటాయింపు..!

పేటీఎం ఐపీవోలో షేరు కేటాయింపు ధరను నిర్ణయించారు. ఒక్కోషేరు రూ.2,150కు కేటాంచనున్నారు. పేటీఎం నేడు ది రిజిస్టార్‌ ఆఫ్‌ కంపెనీస్‌కు సమర్పించిన ఫైనల్‌ ప్రాస్పెక్ట్స్‌ ప్రకారం నవంబర్‌ 18వ తేదీన ఈ కంపెనీ మార్కెట్లో లిస్ట్‌కానుంది.  ఐపీవో బిడ్డింగ్‌ల స్వీకరణ సమయంలో దీని ప్రైస్‌బ్యాండ్‌ను రూ

Published : 12 Nov 2021 18:12 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పేటీఎం ఐపీవోలో షేరు కేటాయింపు ధరను నిర్ణయించారు. ఒక్కో షేరు రూ.2,150కు కేటాయించనున్నారు. పేటీఎం నేడు ది రిజిస్టార్‌ ఆఫ్‌ కంపెనీస్‌కు సమర్పించిన ఫైనల్‌ ప్రాస్పెక్ట్స్‌ ప్రకారం నవంబర్‌ 18వ తేదీన ఈ కంపెనీ మార్కెట్‌లో లిస్ట్‌ కానుంది.  ఐపీవో బిడ్డింగ్‌ల స్వీకరణ సమయంలో దీని ప్రైస్‌ బ్యాండ్‌ రూ. 2,080 నుంచి రూ.2,150 మధ్యలో ఉండొచ్చని కంపెనీ పేర్కొంది. షేరు అత్యధిక ధరను పరిగణనలోకి తీసుకొని కంపెనీ విలువను రూ.1.39 లక్షల కోట్లుగా లెక్కగట్టారు. ఈ ఐపీవోకు 1.89రెట్లు అధికంగా బిడ్డింగ్‌లు వచ్చాయి.

ఈ ఐపీవో కోసం పేటీఎం లీగల్‌ పార్ట్‌నర్లు, బుక్‌ రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్లకు (బీఆర్‌ఎల్‌ఎం), సలహాదారులకు ఫీజు మొత్తాల వివరాలను విడుదల చేసింది. బీఆర్‌ఎల్‌ఎంకు రూ.323.9 కోట్లను చెల్లించనుంది. ఇది ఐపీవో మొత్తం సైజులో 1.8శాతానికి సమానం మోర్గాన్‌ స్టాన్లీ, గోల్డ్‌మన్‌ సాక్స్‌, యాక్సిస్‌ క్యాపిటల్‌, ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌, జేపీ మోర్గాన్‌, సిటీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులను బీఆర్‌ఎల్‌ఎంలుగా నియమించింది.

అరుదైన ఘనతలు..

ఈ  ఐపీవో నుంచి పేటీఎం అత్యధికంగా రూ.18,300 కోట్లను సమీకరించనుంది. ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో ఇదే అతిపెద్ద ఐపీవో. ప్రపంచంలోనే 2021లో వచ్చిన రెండో అతిపెద్ద ఐపీవోగా కూడా పేటీఎం ఘనత సాధించింది. అతిపెద్ద ఐపీవో కీర్తి స్పెయిన్‌కు చెందిన అల్‌ఫండ్స్‌కు దక్కింది. ప్రపంచంలో ఐపీవోకు వచ్చిన నాలుగో అతిపెద్ద ఫిన్‌టెక్‌ కంపెనీగా పేటీఎం నిలిచింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని