Petrol Prices: ఆగని పెట్రో బాదుడు

దేశంలో చమురు ధరలు శనివారం మరోసారి పెరిగాయి. ధరల పెంపునకు శుక్రవారం ఒక్కరోజు విరామం ఇచ్చిన విక్రయ సంస్థలు.. శనివారం మళ్లీ పెంచాయి. లీటర్‌ పెట్రోల్‌పై 35 పైసలు, డీజిల్‌పై 27 పైసలు చొప్పున వాతపెట్టాయి....

Updated : 17 Oct 2022 14:37 IST

దిల్లీ: దేశంలో చమురు ధరలు శనివారం మరోసారి పెరిగాయి. ధరల పెంపునకు శుక్రవారం ఒక్కరోజు విరామం ఇచ్చిన విక్రయ సంస్థలు.. శనివారం మళ్లీ పెంచాయి. లీటర్‌ పెట్రోల్‌పై 35 పైసలు, డీజిల్‌పై 27 పైసలు చొప్పున వాతపెట్టాయి.

తెలుగు రాష్ట్రాల్లో గుంటూరులో లీటర్‌ పెట్రోల్‌ రూ.107.13కు చేరగా డీజిల్‌ రూ.99.66కు పెరిగింది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.104.87, డీజిల్ ధర రూ.97.96గా ఉంది. ఇక మెట్రో నగరాల్లో దిల్లీలో లీటర్ పెట్రోల్‌ ధర రూ.100.91కు చేరగా, డీజిల్‌ ధర రూ.89.88కి పెరిగింది. ముంబయిలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.106.93, డీజిల్‌ ధర రూ.97.47గా ఉంది. మే 4 తర్వాత ప్రారంభమైన పెట్రో ధరల పెరుగుదల పరంపర నిరంతరాయంగా కొనసాగుతోంది. దేశీయంగా ప్రభుత్వాలు విధిస్తున్న పన్నులతో పాటు అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఎగబాకుతుండడం సామాన్యులపై తీవ్ర భారం మోపుతోంది. గత రెండు నెలల్లో లీటర్‌ పెట్రోల్‌పై దాదాపు రూ.10, డీజిల్‌పై రూ.09 పెరిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని