అద్దెకు పవర్‌ బ్యాంకులు: స్పైక్‌

మెట్రో స్టేషన్లు, సినిమా హాళ్లు, మాల్స్‌, విమానాశ్రయాలు తదితర ప్రాంతాల్లో స్మార్ట్‌ ఫోన్లు ఛార్జింగ్‌ చేసుకునేందుకు వీలు కల్పించేలా పవర్‌ బ్యాంకులను అద్దెకు ఇచ్చే సంస్థ స్పైక్‌, మరిన్ని నగరాలకు ఈ సేవలు విస్తరించనుంది.

Published : 06 Mar 2021 01:10 IST

ఈనాడు, హైదరాబాద్‌: మెట్రో స్టేషన్లు, సినిమా హాళ్లు, మాల్స్‌, విమానాశ్రయాలు తదితర ప్రాంతాల్లో స్మార్ట్‌ ఫోన్లు ఛార్జింగ్‌ చేసుకునేందుకు వీలు కల్పించేలా పవర్‌ బ్యాంకులను అద్దెకు ఇచ్చే సంస్థ స్పైక్‌, మరిన్ని నగరాలకు ఈ సేవలు విస్తరించనుంది. జస్ట్‌డయల్‌ సహ వ్యవస్థాపకుడు రమణి అయ్యర్‌ దీని వ్యవస్థాపకుడు. దిల్లీ, హైదరాబాద్‌, బెంగళూరు, ముంబయితో సహా 11 నగరాల్లో మొత్తం 8,000 ప్రాంతాల్లో స్పైక్‌ సేవలనందిస్తోందన్నారు. త్వరలోనే మరిన్ని నగరాలకు ఈ సేవలను విస్తరిస్తున్నామన్నారు. క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి, పవర్‌ బ్యాంకులను తీసుకోవచ్చని, తర్వాత స్పైక్‌ స్టేషన్‌లో దాన్ని అప్పగిస్తే సరిపోతుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని