Future Group: ఫ్యూచర్‌ గ్రూప్‌నకు ఉపశమనం..!

కిషోర్‌ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్‌ గ్రూప్‌కు న్యాయస్థానంలో ఊరట లభించింది. ఈ కంపెనీకి చెందిన ఫ్యూచర్‌ కూపన్స్‌, ఫ్యూచర్‌ రీటైల్‌, ప్రమోటర్‌ కిషోర్‌ బియానీకి చెందిన ఆస్తుల అటాచ్‌పై దిగువ కోర్టు

Published : 09 Sep 2021 18:49 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కిషోర్‌ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్‌ గ్రూప్‌నకు న్యాయస్థానంలో ఊరట లభించింది. ఈ కంపెనీకి చెందిన ఫ్యూచర్‌ కూపన్స్‌, ఫ్యూచర్‌ రీటైల్‌, ప్రమోటర్‌ కిషోర్‌ బియానీకి చెందిన ఆస్తుల అటాచ్‌పై దిగువ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు నేడు నిలిపివేసింది. గతంలో ఆన్‌లైన్‌ రీటైలర్‌ అమెజాన్‌.. సింగపూర్‌ ఆర్బిట్రేషన్‌ కోర్టు ఆదేశాల అమలు కోరుతూ దిల్లీ కోర్టును ఆశ్రయించింది. తాజాగా ఆ కోర్టు ఆదేశాలు, ప్రొసీడింగ్స్‌పై సుప్రీం కోర్టు స్టే విధించింది. 

ఫ్యూచర్‌ గ్రూప్‌ రిటైల్‌ వ్యాపారం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు విక్రయిస్తూ కుదుర్చుకొన్న డీల్‌పై అమెజాన్‌తో వివాదం చెలరేగింది. తాజాగా ఈ డీల్‌కు చెందిన సంబంధిత విభాగాలైన ఎన్‌సీఎల్‌టీ, సీసీఐ, సెబీలు.. డీల్‌కు అంగీకారం తెలిపే తుది ఆదేశాలను జారీ చేయవచ్చని న్యాయస్థానం పేర్కొంది. ఫ్యూచర్‌ గ్రూప్‌ దాఖలు చేసిన అప్పీల్‌ను నాలుగు వారాల తర్వాత విచారణకు స్వీకరిస్తామని చెప్పింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని