అంకురాల కోసం రూ.100 కోట్లు

అంకురాలను ప్రోత్సహించేందుకు ఈ ఏడాదిలో రూ.100 కోట్ల వరకూ పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించినట్లు ఇండియన్‌ ఏంజెల్‌ నెట్‌వర్క్‌ (ఐఏఎన్‌) కన్సార్షియం వెల్లడించింది....

Published : 16 Feb 2021 00:57 IST

ఇండియన్‌ ఏంజెల్‌ నెట్‌వర్క్‌

దిల్లీ: అంకురాలను ప్రోత్సహించేందుకు ఈ ఏడాదిలో రూ.100 కోట్ల వరకూ పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించినట్లు ఇండియన్‌ ఏంజెల్‌ నెట్‌వర్క్‌ (ఐఏఎన్‌) కన్సార్షియం వెల్లడించింది. బయోటెక్నాలజీ, అగ్యుమెంటెడ్‌ రియాల్టీ, ఉత్పత్తి, పర్యావరణ,  వైద్య పరికరాలు, ఆరోగ్య సంరక్షణ రంగాలతో పాటు, డేటా అనలిటిక్స్‌ ఆధారిత సంస్థలు, వినూత్న ఆవిష్కరణలతో ముందుకు వస్తున్న అంకురాలకు పెట్టుబడులు అందించనున్నట్లు కన్సార్షియం సహ వ్యవస్థాపకురాలు పద్మజ రుపారెల్‌ తెలిపారు. కొన్ని సంస్థల నుంచి లాభాలతో పెట్టుబడి వెనక్కి తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఐఏఎన్‌ 2020లో ఫార్‌ఐ, ఫ్యాబ్‌ అల్లే, హంగ్రీజోన్‌, స్టాక్యు తదితర 45-50 సంస్థల్లో పెట్టుబడులు పెట్టింది. ఇందులో 3-4 సంస్థలు 15 రెట్ల వృద్ధి చూపించాయి. పర్యావరణ విభాగంలో ఉన్న సంస్థలకు మన దేశంలో పెట్టుబడులు పెరిగాయని, అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న సంస్థలూ ఇక్కడి నుంచి పెట్టుబడులు సమీకరిస్తున్నాయని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని