రేపటి నుంచి ఎస్‌బీఐ మెగా ఈ-వేలం

దేశంలోనే అతి పెద్దదైన స్టేట్‌బ్యంక్‌ ఆఫ్‌ ఇండియా రేపటి నుంచి మెగా ప్రాపర్టీ వేలాన్ని ప్రారంభించనుంది. తాకట్టులో ఉన్న ఆస్తులను ఈ ఎలక్ట్రానిక్‌ విధానంలో వేలం వేయనుంది. దీనిలో వాణిజ్య, గృహ ..

Published : 29 Dec 2020 15:06 IST

న్యూదిల్లీ: దేశంలోనే అతి పెద్దదైన స్టేట్‌బ్యంక్‌ ఆఫ్‌ ఇండియా రేపటి నుంచి మెగా ప్రాపర్టీ వేలాన్ని ప్రారంభించనుంది. తాకట్టులో ఉన్న ఆస్తులను ఈ ఎలక్ట్రానిక్‌ విధానంలో వేలం వేయనుంది. దీనిలో వాణిజ్య, గృహ సముదాయలు ఉన్నాయి. ఈ విషయాన్ని ఎస్‌బీఐ ట్విటర్‌లో ప్రకటించింది. మార్కెట్‌ ధరల కంటే కొంచె చౌకగా ఇళ్లను కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది మంచి అవకాశమని పేర్కొంది.

‘అప్పులు తీసుకొని దివాలా తీసిన వారి తనఖా ఆస్తులను విక్రయిస్తున్నాం. బ్యాంకు రుణాలను ఇలా వసూలు చేయనున్నాం’ అని ఎస్‌బీఐ పేర్కొంది. ఈ వేలంలో పాల్గొనేవారు నోటీస్‌లో సూచించిన విధంగా ఎలక్ట్రానిక్‌ మనీ డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు కేవైసీ పత్రాలను కూడా సంబంధిత ఎస్‌బీఐ బ్రాంచిలో సమర్పించాలి. 

పత్రాలను సంబంధిత బ్రాంచిల్లో అప్పగించాక.. అక్కడి నుంచి వినియోగదారులకు లాగిన్‌ ఐడీ, పాస్‌వర్డ్‌లను ఈమెయిల్‌లో పంపిస్తారు. వేలం జరిగే సమయంలో బిడ్డర్లు లాగిన్‌ అయి.. తమ బిడ్లను దాఖలు చేయవచ్చు. ప్రస్తుత వేలంలో 3,317 గృహాలు, 935 వాణిజ్య సముదాయాలు, 513 పారిశ్రామిక సముదాయాలు, 9 వ్యవసాయ క్షేత్రాలను ఉంచింది.  

ఇవీ చదవండి..

బజాజ్‌ ఆటో @ రూ. లక్ష కోట్లు

పట్టిందల్లా డబ్బే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని