Star Health IPO: నవంబరు 30న స్టార్‌ హెల్త్‌ ఐపీఓ

ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటుపరం చేసే బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టనుంది...

Published : 24 Nov 2021 21:12 IST

దిల్లీ: ప్రముఖ మదుపరి రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా పెట్టుబడులు ఉన్న బీమా సంస్థ ‘స్టార్‌ హెల్త్‌ అండ్‌ అల్లీడ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ’ పబ్లిక్ ఇష్యూ నవంబరు 30న ప్రారంభం కానుంది. డిసెంబరు 2 వరకు సబ్‌స్క్రిప్షన్‌ కొనసాగనుంది. ధరల శ్రేణిని రూ.870-900గా నిర్ణయించారు. మొత్తం రూ.7,249 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఐపీవోలో రూ.2,000 కోట్లు విలువ చేసే తాజా షేర్లతో పాటు 58,324,225 కోట్ల ఈక్విటీ షేర్లు ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద విక్రయించనున్నారు. రూ.100 కోట్లు విలువ చేసే షేర్లను ఉద్యోగులకు రిజర్వ్‌ చేశారు. ఈ ఇష్యూ ద్వారా సమకూరే నిధులతో కంపెనీ క్యాపిటల్‌ బేస్‌ను పెంచనున్నారు. ఈ ఇష్యూలోని 75 శాతం షేర్లను ‘క్యాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ బయ్యర్స్‌(క్యూఐబీ)’కు, 15 శాతం సంస్థాగతేతర మదుపర్లకు, పది శాతం షేర్లు రిటైల్‌ మదుపర్లకు కేటాయించారు. ఒక లాట్‌కు 16 షేర్లను నిర్ణయించారు.

దేశంలో ప్రముఖ ఆరోగ్య బీమా సంస్థల్లో ఒకటిగా ఉన్న స్టార్‌ హెల్త్‌ను వెస్ట్‌బ్రిడ్జ్‌ క్యాపిటల్‌, రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా వంటి మదుపర్ల కన్సార్టియం ఆధ్వర్యంలో ఉంది. దేశంలో బీమా సంస్థల్లో ప్రస్తుతం ఎస్‌బీఐ లైఫ్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌, ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్ మాత్రమే స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని